రామసేతును గౌరవించాలి : బీజేపీ ఎంపీ స్వామి

రామసేతు వారధి మానవ నిర్మితమని భారతీయులందరికీ తెలుసని, అమెరికా శాస్త్రవేత్తలు మరోసారి నిర్ధారిస్తున్నారని బీజేపీ నేత, రాజ్యసభ సభ్యుడు డాక్టర్ సుబ్రహ్మణ్యస్వామి చెప్పుకొచ్చారు.

Webdunia
గురువారం, 14 డిశెంబరు 2017 (09:43 IST)
రామసేతు వారధి మానవ నిర్మితమని భారతీయులందరికీ తెలుసని, అమెరికా శాస్త్రవేత్తలు మరోసారి నిర్ధారిస్తున్నారని బీజేపీ నేత, రాజ్యసభ సభ్యుడు డాక్టర్ సుబ్రహ్మణ్యస్వామి చెప్పుకొచ్చారు. ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ, జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియాకు చెందిన కమిటీ సైతం ఇది మానవ నిర్మితమని చెప్పిందన్నారు. అందువల్ల శ్రీరాముడికి ప్రతిరూపంగా భావిస్తున్న రామసేతును ప్రతి ఒక్కరూ గౌరవించాలని ఆయన కోరారు. 
 
కాగా, భారత్, శ్రీలంకను కలుపుతూ సముద్రంలో ఉన్న రామసేతు (వారధి) మానవ నిర్మితమేనని అమెరికా శాస్త్రవేత్తలు తేల్చిన విషయం తెల్సిందే. శ్రీరాముడు లంక వరకు ఈ వారధిని నిర్మించినట్టు రామాయణంలో ప్రస్తావన ఉంది. అయితే దీనిపై కొన్నేళ్లుగా వివాదం సాగుతోంది. ఈ వారధిని రాముడే నిర్మింపజేశాడని కొందరు, సహజసిద్ధంగా ఏర్పడిందని మరికొందరు వాదిస్తున్నారు.
 
ఈ నేపథ్యంలో తాజాగా డిస్కవరీ సైన్స్ చానల్‌కు చెందిన శాస్త్రవేత్తల బృందం పరిశోధనలు జరిపి రామసేతు సహజసిద్ధంగా ఏర్పడలేదని, మానవులే నిర్మించారని నిర్ధారించింది. పరిశోధనకు సంబంధించిన ప్రత్యేక కార్యక్రమం కూడా అమెరికాలో ప్రసారమైంది. ఈ కార్యక్రమ ప్రోమోలో ఓ భూగర్భ శాస్త్రవేత్త రామసేతులో ఉన్న రాళ్లను వేరే ప్రాంతం నుంచి తీసుకొచ్చి అక్కడి ఇసుక దిబ్బలపై అమర్చారు అని తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వీధికుక్కలు దేశంలో ఎవరిని కరిచినా నన్నే నిందిస్తున్నారు : అక్కినేని అమల

సోషల్ మీడియాలో కీర్తి సురేష్ మార్ఫింగ్ ఫోటోలు... బోరుమంటున్న నటి

మీకు దణ్ణం పెడతా, నేను సన్యాసం తీసుకోవట్లేదు: రేణూ దేశాయ్ (video)

Joy Crizildaa: నీకు దమ్ముంటే డీఎన్ఏ టెస్టుకు రావయ్యా.. మాదంపట్టికి జాయ్ సవాల్

NC24: నాగ చైతన్య, మీనాక్షి చౌదరి చిత్రం టైటిల్, ఫస్ట్ లుక్ రాబోతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments