మహిళను కాలితో తన్నిన బీజేపీ ఎమ్మెల్యే.. వీడియో వైరల్

Webdunia
సోమవారం, 3 జూన్ 2019 (13:16 IST)
బీజేపీ నేతలకు నోటిదూల ఎక్కువని ఇప్పటికే చాలాసార్లు వినేవుంటాం. ప్రస్తుతం చేతికి కూడా పని చెప్తున్నారు. తాజాగా బీజేపీ ఎమ్మెల్యే మహిళను కాలితో తన్నాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. 


వివరాల్లోకి వెళితే.. అహ్మదాబాద్ నరోడా ప్రాంతానికి చెందిన బీజేపీ ఎమ్మెల్యే బాల్‌రామ్ దవానీ ఓ మహిళపై దాడి చేయడం.. కాలితో తన్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరలై కూర్చుంది. 
 
బాధిత మహిళ నీటికొరతపై ఫిర్యాదు చేసేందుకు వచ్చింది. ఆ సమయంలో ఆ మహిళపై ఎమ్మెల్యే దాడికి పాల్పడ్డారు. ఈ వీడియోలో కిందకు నెట్టిన ఆ మహిళపై ఓ బృందం దాడికి పాల్పడింది.

మహిళను ఏకంగా ఎమ్మెల్యే కాలితో తన్నారు. ఈ ఘటనపై బాల్‌రామ్ దవానీ విచారం వ్యక్తం చేసినట్లు వార్తలు వస్తున్నాయి. కానీ ఈ వీడియో మాత్రం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. 
 
ఈ ఘటనపై బాధిత మహిళ స్పందిస్తూ.. నలుగురితో కూడిన బృందం తనపై దాడిచేస్తే.. తన భర్తపై ఆరుగురు దాడికి పాల్పడ్డారని.. ఈ విషయాన్ని ప్రధాని మోదీకి అప్పీలు చేస్తున్నానని.. మోదీగారు భేటీ బచావో బేటీ పడావో అన్నారని.. కానీ ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు మాత్రం మహిళను కాలితో తన్నారని చెప్పుకొచ్చింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'అఖండ్-2' ప్రీమియర్ షోలు రద్దు.. ఎందుకో తెలుసా?

సినిమా పెట్టుబడి రూ.50 లక్షలు.. 54రోజుల్లో రూ.100 కోట్ల కలెక్షన్లు

టాలీవుడ్ ప్రముఖులతో సమావేశమైన కొరియన్ డైరెక్టర్, ప్రొడ్యూసర్ యూ ఇన్-సిక్

సినిమాకు శృంగారం, సెక్సువల్ డిజైర్స్ ఇతివృత్తంగా తీసుకున్నా : ఎన్ హెచ్ ప్రసాద్

Aadi Pinishetti: ఆది పినిశెట్టి థ్రిల్లర్ మూవీ డ్రైవ్ రిలీజ్ కు సిద్దం.

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

scrub typhus fever, విశాఖలో బెంబేలెత్తిస్తున్న స్క్రబ్ టైఫస్ పురుగు కాటు జ్వరం

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

బియ్యం కడిగిన నీటిలో ధనియాలను మెత్తగా నూరి పటికబెల్లం కలిపి తింటే?

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

నిజామాబాద్‌లో విద్యార్ధుల కోసం నాట్స్ దాతృత్వం, నిర్మలా హృదయ్ హైస్కూల్‌కి డిజిటల్ బోర్డులు

తర్వాతి కథనం
Show comments