నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టి గురువారా(జూన్ 26వ తేదీ)కి రెండేళ్ళు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ దేశ వ్యాప్తంగా సంబరాలు నిర్వహిస్తోంది. ఈ సంబరాల్లో భాగంగా భారీ ఎత్తున ర్యాలీలు, సభలు నిర్వహించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది.
ఇందులోభాగంగా, శుక్రవారం ఉత్తరప్రదేశ్‌లోని సహరాన్‌పూర్‌లో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసింది. ఇందులో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పాల్గొని ప్రసంగించనున్నారు. దీనిపై భాజపా జాతీయ కార్యదర్శి అనిల్ జైన్ మాట్లాడుతూ కేంద్ర మంత్రులు, పార్టీ కార్యకర్తలు వివిధ ప్రాంతాల్లో మోడీ ప్రభుత్వం సాధించిన విజయాలకు సంబంధించిన వేడుకలను నిర్వహించనున్నారు. మే 27 నుంచి జూన్ 15 వరకు ఈ వేడుకలు జరగుతాయని చెప్పారు.
వచ్చే ఏడాది ఉత్తరప్రదేశ్‌లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అక్కడ మోదీ రెండేళ్ల పాలన విజయోత్సవ సభను నిర్వహించేందుకు ఎంపిక చేసినట్లు ఆయన తెలిపారు. గతేడాది నిర్వహించిన మొదటి విజయోత్సవ సభ మధురలో నిర్వహించారు. కాగా, ఈ యేడాది 198 నగరాల్లో 33 బృందాలు ఈ వేడుకలను నిర్వహించనున్నారు.