Webdunia - Bharat's app for daily news and videos

Install App

బలవంతపు మతమార్పిడులకు బీజేపీ వ్యతిరేకం : అమిత్ షా!

Webdunia
ఆదివారం, 21 డిశెంబరు 2014 (13:32 IST)
దేశంలో బలవంతపు మతమార్పిడులకు తాము, తమ పార్టీ వ్యతిరేకమని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా చెప్పుకొచ్చారు. చెన్నైలో జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడుతూ... బలవంతపు మత మార్పిడులను నిషేధిస్తూ తమ ప్రభుత్వం రూపొందించనున్న బిల్లుకు ఇతర రాజకీయ పార్టీలు మద్దతివ్వాలని కోరారు. లౌకిక పార్టీలుగా ప్రచారం చేసుకుంటున్న పార్టీలు ఈ విషయంలో ముందుకురావాలని ఆయన కోరారు. 
 
మత మార్పిడుల బిల్లుపై రాజకీయ పార్టీలతో సంప్రదింపులు జరిపిన తర్వాత ప్రజాభిప్రాయాన్ని కూడా సేకరిస్తామని ఆయన శనివారం చెప్పారు. ఉత్తరప్రదేశ్‌లో ‘ఘర్ వాపసీ’ పేరిట హిందూ అనుకూల వర్గాలు చేపట్టనున్న మత మార్పిడుల అంశం కోర్టు పరిధిలో ఉందని, అందువల్ల ఈ అంశంపై తాను స్పందించబోనని చెప్పారు. 
 
ఇకపోతే.. తమిళులకు స్వభాషాభిమానం ఎక్కువన్న విషయాన్ని పసిగట్టిన అమిత్ షా, దానినే ఆయుధంగా తీసుకుని తన ప్రసంగాన్ని ప్రారంభించారు. తమిళంలో మాట్లాడలేకపోతున్నందుకు చెన్నైవాసులకు క్షమాపణలు చెప్పిన అమిత్ షా, ‘‘తమిళం నేర్చుకోవడం ప్రారంభించాను. త్వరలో తమిళంలోనే మాట్లాడతా’’నంటూ ఆయన వ్యాఖ్యానించారు. 

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

Show comments