Webdunia - Bharat's app for daily news and videos

Install App

మణిపూర్ సీఎంగా ప్రమాణం చేసిన ఫుట్‌బాల్ మాజీ క్రీడాకారుడు బీరేన్ సింగ్

మణిపూర్‌లో బీజేపీ సర్కారు కొలువుదీరింది. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిగా బీరేన్ సింగ్ ప్రమాణ స్వీకారం చేశారు. ఆయన ఫుట్‌బాల్ మాజీ క్రీడాకారుడు. పైగా ఓ జర్నలిస్టు కూడా. బుధవారం మణిపూర్ రాష్ట్ర రాజధాని ఇంఫాల్‌లో

Webdunia
బుధవారం, 15 మార్చి 2017 (14:42 IST)
మణిపూర్‌లో బీజేపీ సర్కారు కొలువుదీరింది. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిగా బీరేన్ సింగ్ ప్రమాణ స్వీకారం చేశారు. ఆయన ఫుట్‌బాల్ మాజీ క్రీడాకారుడు. పైగా ఓ జర్నలిస్టు కూడా. బుధవారం మణిపూర్ రాష్ట్ర రాజధాని ఇంఫాల్‌లోని రాజ్‌భవన్‌లో జరిగిన కార్యక్రమంలో ముఖ్యమంత్రిగా ఎన్.బిరేన్ సింగ్ ప్రమాణ స్వీకారం చేశారు. 
 
ఈయనతో ఆ రాష్ట్ర గవర్నర్ నజ్మా హెప్తుల్లా ప్రమాణ స్వీకారం చేయించారు. అలాగే, జాయ్ కుమార్ సింగ్ ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణం చేశారు. ఈయన ఎన్పీపీ పార్టీనేత. మణిపూర్ మాజీ డీజీపీ. అలాగే విశ్వజీత్ సింగ్, జయంత్ కుమార్‌లు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. 
 
ఇటీవల జరిగిన ఎన్నికల్లో 60 స్థానాలున్న మణిపూర్‌‌లో బీజేపీకి కేవలం 21 స్థానాలు రాగా, కాంగ్రెస్ 28 స్థానాల్లో విజయం సాధించింది. అయినప్పటికీ మిగిలిన పార్టీల మద్దతు సంపాదించడంలో కాంగ్రెస్ విఫలం కావడంతో గవర్నర్ బీజేపీని ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించారు. దీనిపై కాంగ్రెస్ పార్టీ గగ్గోలు పెడుతోంది. సుప్రీంకోర్టును ఆశ్రయించనున్నట్టు ఆ పార్టీ నేతలు ప్రకటించారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వరుణ్ తేజ్ VT15 అనంతపూర్ షెడ్యూల్స్ పూర్తి, నెక్స్ట్ కొరియాలో

ఈ విజయ వైభవం మాకు చాలా ప్రత్యేకం: రుత్విక్, సాత్విక్

Pawan Kalyan: రిటర్న్ గిఫ్ట్ స్వీకారం... సినిమా రంగం కోసం ప్రత్యేక పాలసీ

క్రిష్ణ జయంతి సందర్భంగా 800 స్క్రీన్‌లలో ఖలేజా రీ-రిలీజ్

అసభ్యతలేని నిజాయితీ కంటెంట్‌తో తీసిన సినిమా నిలవే : హీరో సౌమిత్ రావు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Fish vegetarian: చేపలు శాకాహారమా? మాంసాహారమా?

పిసిఓఎస్‌తో ఇబ్బంది పడుతున్నారా? వ్యాధి పరిష్కారానికి అనువైన అల్పాహారాలివిగో...

Black Cumin Seed: నల్ల జీలకర్ర కషాయాన్ని మహిళలు తాగితే ఒబిసిటీ మటాష్

ఎసిడిటీని అడ్డుకునేందుకు 5 మార్గాలు

వేరుశనగ చిక్కీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments