వివాహేతర సంబంధం పెట్టుకుందని భార్యను చంపి నీటి ట్యాంకులో వేసిన భర్త

Webdunia
సోమవారం, 6 మార్చి 2023 (17:39 IST)
ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని బిలాస్‌పూర్‌లో ఓ దారుణం జరిగింది. కట్టుకున్న భార్య పరాయి వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుందన్న కారణంతో ఓ వ్యక్తి దారుణానికి పాల్పడ్డాడు. కట్టుకున్న భార్యను హత్య చేసి ముక్కలుగా నరికి, శరీర భాగాలను ప్యాక్ చేసి నీటి ట్యాంకులో వేశాడు. బిలాస్‌పూర్‌లోని ఉస్లాపూపర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది. గత జనవరి 5వ తేదీన ఈ దారుణానికి పాల్పడ్డాడు. ఈ ఘాతుకానికి పాల్పడిన వ్యక్తిని పోలీసులు నకిలీ నోట్ల కేసులో అరెస్టు చేశారు. ఈ కేసును విచారిస్తుండగా భార్యను హత్య చేసిన విషయం వెలుగులోకి వచ్చింది.
 
నకిలీ నోట్ల కేసు విచారణలో భాగంగా, అతని ఇంట్లో పోలీసులు సోదాలు చేస్తుండగా వాటర్ ట్యాంకులో నుంచి దుర్వాసన వచ్చింది. దీన్ని తెరిచి చూడగా, వాటర్ ట్యాంకులో కొన్ని బ్యాగులు కనిపించాయి. వాటిని తెరిచి చూస్తే మృతదేహం ముక్కలు కనిపించడంతో షాక్‍‌కు గురయ్యారు. ఈ మృతదేహం వ్యవహారంపై అతని వద్ద పోలీసులు విచారణ జరుపగా తన భార్య మరో వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుందని, అందువల్ల కోపంతో ఈ హత్య చేసినట్టు అంగీకరించాడు. ఈ దంపతులకు పదేళ్ల క్రితం వివాహం కాగా, ఇద్దరు పిల్లులు కూడా ఉన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Bala Saraswati Devi : రావు బాలసరస్వతి గారు ఆత్మకు శాంతి చేకూరాలి: పవన్ కళ్యాణ్

Priyadarshi: ఏమీ చేయలేకపోతోన్నప్పుడు నెగెటివ్ కామెంట్లను చేస్తుంటారు : ప్రియదర్శి

గోపి గాళ్ల గోవా ట్రిప్.. కాన్సెప్ట్ చిత్రాలకు సపోర్ట్ చేయాలి : సాయి రాజేష్

Sudheer Babu: జటాధార తో సుధీర్ బాబు డాన్స్ లో ట్రెండ్ సెట్ చేస్తాడా...

Prabhas : రెబల్‌స్టార్ ప్రభాస్ సాలార్ రి రిలీజ్ కు సిద్దమైంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మామిడి రసం ఇలా తయారు చేస్తున్నారా? చిన్నారులు ఈ జ్యూస్‌లు తాగితే..? (video)

నిమ్మరసం ఎవరు తాగకూడదో తెలుసా?

ఫ్యాటీ లివర్ సమస్యను అడ్డుకునే చిట్కాలు

ఇంటి లోపల ఆరోగ్యాన్నిచ్చే మొక్కలు ఏంటి?

వెల్లుల్లి పొట్టును సులభంగా తొలగించాలంటే... మైక్రో ఓవెన్‌లో?

తర్వాతి కథనం
Show comments