Webdunia - Bharat's app for daily news and videos

Install App

మీర్జాపూర్‌లో ఏటీఎం సొమ్ము దోపిడీ.. సెక్యూరిటీ గార్డును చంపేసి...

Webdunia
బుధవారం, 13 సెప్టెంబరు 2023 (08:52 IST)
బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఒకటైన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని మీర్జాపూర్‌లో దారుణం జరిగింది. సెక్యూరిటీ గార్డును చంపేసి ఏటీఎం కేంద్రంలోని సొమ్మును దోచుకున్నారు. ఈ ఘటన పట్టపగలు జరిగింది. దోపిడీ దొంగలు రెచ్చిపోయి బీభత్సం సృష్టించారు. 
 
మీర్జాపూర్‌, కత్రా కొత్వాలి ప్రాంతంలోని బెల్టార్‌లో యాక్సిస్‌ బ్యాంకు, దాని పక్కనే ఏటీఎం ఉన్నాయి. ఏటీఎంలో డబ్బులు నింపేందుకు మంగళవారం ఇద్దరు క్యాషియర్లు, ఓ గార్డు వ్యానులో వచ్చారు. వారు కిందికి దిగి తమ పనిలో నిమగ్నమయ్యారు. 
 
హెల్మెట్లు ధరించి అప్పటిదాకా ఆ చుట్టుపక్కల తచ్చాడిన నలుగురు దుండగులు అమాంతం వారి మీద దాడి చేశారు. సెక్యూరిటీ గార్డును తుపాకీతో కాల్చి చంపారు. మరో దుండగుడు వ్యాన్‌ డోరు వద్దకు వెళ్లి రూ.39 లక్షల నగదు ఉన్న పెట్టెను హస్తగతం చేసుకున్నాడు. ఈ ముఠా రెండు బైకులపై పరారైంది. ఈ దోపిడీ మొత్తం సమీపంలోని సీసీ టీవీ కెమెరాలో రికార్డయ్యింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కిరణ్ అబ్బవరం కొత్త సినిమా కెఎ10 టైటిల్ అనౌన్స్ మెంట్

సంబరాల ఏటిగట్టు లో వారియర్ గా సాయి దుర్గతేజ్

హరికథ కు స్పందనతో టీంకు గ్రాండ్ పార్టీ ఇచ్చిన టీజీ విశ్వ ప్రసాద్

అల్లు అర్జున్ అరెస్టు సబబు కాదు : నటుడు సుమన్

లైలా చిత్రంలో అమ్మాయి పాత్రలో విశ్వక్సేన్ !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ట్రెండ్స్ సీజన్ క్లోజింగ్ సేల్, ప్రత్యేకమైన తగ్గింపు ఆఫర్‌లు

గోరింటను చేతులకు, కాళ్లకు పెట్టుకుంటే ఫలితాలు ఏమిటి?

శీతాకాలంలో ఆరోగ్యంగా వుండేందుకు 10 చిట్కాలు

పారాసిట్మాల్ మాత్రతో తస్మాత్ జాగ్రత్త!!

Ginger Milk in winter: శీతాకాలంలో అల్లం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments