Webdunia - Bharat's app for daily news and videos

Install App

బీహార్ ఎన్నికల్లో ఓడిపోతున్నాం.. నితీష్ కుమార్ మోసం చేశాడు: ములాయం

Webdunia
మంగళవారం, 13 అక్టోబరు 2015 (11:14 IST)
బీహార్ ఎన్నికలపై సమాజ్ వాదీ పార్టీ సుప్రీం ములాయం సింగ్ యాదవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీహార్ నుంచి తమ పార్టీ పూర్తిగా నిష్క్రమించనుందని ములాయం చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి. బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ వైపు అనుకూల పవనాలు వీస్తాయని, బీజేపీదే విజయమని.. మహాకూటమికి ఓటమి ఖాయమని ములాయం వ్యాఖ్యానించారు. 
 
తద్వారా బీహార్‌లో బీజేపీకే ప్రభుత్వ పగ్గాలు దక్కనున్నాయని ములాయం సింగ్ చెప్పారు. నితీష్ కుమార్ తమను మోసం చేశాడని, జనతా పరివార్‌ను ఏర్పాటు చేసినప్పుడు ఒకలా, ఆపై సీట్ల పంపిణీలో మరోలా వ్యవహరించారని ములాయం సింగ్ ఆరోపించారు. తామంతా కలసికట్టుగా ఉండలేకపోయామని, మహాకూటమి ఓటమికి ఇదే ప్రధాన కారణమని అన్నారు. 
 
మరోవైపు బీహార్‌లో బీజేపీ పార్టీ ఓడిపోతే ప్రధాన మంత్రి పదవికి నరేంద్ర మోడీ రాజీనామా చేయగలరా? అని రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జేడీ) అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ సవాల్ విసిరారు. బీహార్‌లో రెండో విడత ఎన్నికల ప్రచారంలో భాగంగా రాజకీయ నేతలు విమర్శనాస్త్రాలు సంధించుకుంటున్నారు.

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

Show comments