Webdunia - Bharat's app for daily news and videos

Install App

బిడ్డ ఏడుపు ఆపలేదని.. ఫెవిక్విక్‌ను నోటికి అంటించింది..

Webdunia
సోమవారం, 25 మార్చి 2019 (11:13 IST)
రాను రాను మానవీయ విలువలు మంటగలిసిపోతున్నాయి. నేరాల సంఖ్య పెచ్చరిల్లిపోతున్నాయి. ఊరకే ఏడుస్తుందని.. పసిబిడ్డపై  కన్నతల్లి పైశాచికత్వాన్ని ప్రదర్శించింది. అభం శుభం తెలియని పసిబిడ్డను కంటికి రెప్పలా కాపాడుకోవాల్సింది పోయి ప్రాణాల మీదకు తెచ్చింది. 
 
చిన్నారి ఏడుపును ఆపలేదని.. గమ్‌ను నోటికి అంటించింది. ఈ దారుణ ఘటన బీహార్‌లో శనివారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. శోభ అనే మహిళ తన భర్త,  ఏడాదిన్నర వయసున్న కుమారుడితో కలిసి ఛాప్రాలో నివాసం ఉంటుంది. 
 
తన కొడుకు పదే పదే ఏడుస్తుండటంతో సముదాయించాల్సింది పోయి దారుణానికి ఒడిగట్టింది. భర్త ఇంట్లోలేని సమయంలో కుమారుడి పెదాలకు ఫెవిక్విక్‌ పూసింది. దీంతో చిన్నారి నోట్లో నుంచి నురగ వచ్చింది. ఈలోగా ఇంటికి వచ్చిన శోభ భర్త దీన్ని గమనించాడు.
 
ఎందుకిలా జరిగిందని అతడు ప్రశ్నించడంతో ఫెవిక్విక్‌తో అంటించానని చెప్పింది. దీంతో షాక్ అయిన శోభ భర్త.. వెంటనే చిన్నారిని ఆసుపత్రికి తీసుకెళ్లగా ప్రాణాపాయం తప్పింది. శోభపై పోలీసులు కేసు నమోదు చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

టాలీవుడ్‌లో విషాదం - నటుడు ఫిష్ వెంకట్ ఇకలేరు..

60 యేళ్ల వయసులో 30 యేళ్ల నటిని పెళ్ళాడిన తమిళ దర్శకుడు మృతి

Venu Swami: వేణు స్వామి పూజలు ఫలించలేదా? నిధి అగర్వాల్ ఏమందంటే....

రామ్ పోతినేని రాసిన ఆంధ్రా కింగ్ తాలూకా ఫస్ట్ సింగిల్ పాడిన అనిరుధ్ రవిచందర్

Anandi: బుర్రకథ కళాకారిణి గరివిడి లక్ష్మి పాత్రలో ఆనంది ఫస్ట్ లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

తర్వాతి కథనం
Show comments