Webdunia - Bharat's app for daily news and videos

Install App

నీ ఫ్రెండ్‌ను రేప్ ఎలా చేశాడు? రేప్ చేస్తుంటే నీవు ఏం చేశావు? విద్యార్థినితో బీహార్ ఎమ్మెల్యే అసభ్య ప్రశ్నలు

బీహార్ ఎమ్మెల్యే ఒకరు ఓ విద్యార్థినిని అడగకూడని ప్రశ్నలు సంధించాడు. సదరు ప్రజాప్రతినిధి వేసిన ప్రశ్నలకు ఆ విద్యార్థిని సమాధానం చెప్పలేక మిన్నకుండిపోయింది. అయినప్పటికీ.. వదలిపెట్టని ఆ ఎమ్మెల్యే... రేపు

Webdunia
గురువారం, 12 జనవరి 2017 (07:10 IST)
బీహార్ ఎమ్మెల్యే ఒకరు ఓ విద్యార్థినిని అడగకూడని ప్రశ్నలు సంధించాడు. సదరు ప్రజాప్రతినిధి వేసిన ప్రశ్నలకు ఆ విద్యార్థిని సమాధానం చెప్పలేక మిన్నకుండిపోయింది. అయినప్పటికీ.. వదలిపెట్టని ఆ ఎమ్మెల్యే... రేపు నీకు ఇదే విధంగా జరిగితే ఏం చేస్తావు? ఆ కామాంధుడు నీ గదికి వచ్చి రేప్ చేస్తే ఏం చేస్తావు? నిన్ను ఎవరు రక్షిస్తారు? ఇత్యాది ప్రశ్నలు సంధించాడు. దీంతో అక్కడున్న వారంతా ఒక్కసారి అవాక్కయ్యారు. 
 
బీహార్‌లోని వైశాలి జిల్లాలో దళిత విద్యార్థినుల ఆశ్రమ పాఠశాల వసతి గృహం ఉంది. ఇక్కడ ఉంటున్న ఒక విద్యార్థిని రెండు రోజుల క్రితం అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. ఆ విద్యార్థినిపై అత్యాచారం జరిగిందనే అనుమానాలు వస్తున్నాయి. దీంతో రాష్ట్రీయ లోక్ సమతా పార్టీ ఎమ్మెల్యే లాలన్ పాసవాన్ హాస్టల్‌కు వెళ్లారు. 
 
ఈ సంఘటనపై విద్యార్థినులను ఆరా తీసే క్రమంలో అడగకూడని ప్రశ్నలు సంధించాడు. ఇవే ఇపుడు వివాదాస్పదమయ్యాయి. ఎమ్మెల్యే అడిగిన ప్రశ్నలకు ఒక విద్యార్థిని ఇబ్బందిపడుతూ సమాధానాలు చెబుతున్న దృశ్యాలు ప్రసార మాధ్యమాల్లో రావటంతో విమర్శలు తలెత్తాయి.
 
సదరు విద్యార్థినితో ఎమ్మెల్యే మాట్లాడిన తీరు గురించి చెప్పాలంటే... ‘ఆ రేప్ సంఘటన గురించి వివరంగా చెప్పాలి. నువ్వు చెప్పకపోతే మాకు ఎలా తెలుస్తుంది? ఒకవేళ, ఇటువంటి రేప్ నీకే జరిగితే? అత్యాచారం చేసే వ్యక్తి నీ గదికే వస్తే...’ అంటూ ఎమ్మెల్యే ప్రశ్నించడంతో ఆ విద్యార్థిని అవాక్కయింది. దీనిపై విమర్శలు రావడంతో ఎమ్మెల్యే వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. 
 
దళిత విద్యార్థినులకు సాయం చేయాలనే ఉద్దేశంతోనే తాను అలా మాట్లాడానని, ఈ సంఘటన ఎలా జరిగిందనే విషయమై ప్రశ్నిస్తే, మీడియా రాద్ధాంతం చేస్తోందని మండిపడ్డారు. తాను అడిగిన విధానం తప్పయితే అయి ఉండవచ్చు కానీ, తన ఉద్దేశం మాత్రం మంచిదేనని ఆ ఎమ్మెల్యే సమర్థించుకోవడం గమనార్హం.

మ్యూజిక్ షాప్ మూర్తి నుంచి రాహుల్ సిప్లిగంజ్ పాడిన అంగ్రేజీ బీట్ లిరికల్ వచ్చేసింది

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆహ్వానించిన దర్శకుల సంఘం

రోడ్డు ప్రమాదంలో పవిత్ర మృతి.. త్రినయని నటుడు చంద్రకాంత్ ఆత్మహత్య

రాహుల్ విజయ్, శివాని ల విద్య వాసుల అహం ఎలా ఉందంటే.. రివ్యూ

పాయల్ రాజ్‌ పుత్‌తో ప్రభాస్ పెళ్లి.. డార్లింగ్‌గా ఉంటాను?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments