Webdunia - Bharat's app for daily news and videos

Install App

బీహార్‌లో దారుణం : మెడకు చున్నీ చుట్టి బైక్‌కు కట్టేసి ఈడ్చుకెళ్లారు.. బైక్‌తో తొక్కించి చంపేశారు

బీహార్ రాష్ట్రంలో దారుణం జరిగింది. ఓ యువతిని బైక్ కట్టేసి ఈడ్చుకెళ్లి యువతిని హత్య చేసిన ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. ఈ దారుణ ఘటన కైముర్ జిల్లా కార్జావ్ గ్రామంలో హాటా-దుర్గావతి ప్రధాన రహదారిపై మంగళవా

Webdunia
బుధవారం, 26 అక్టోబరు 2016 (14:31 IST)
బీహార్ రాష్ట్రంలో దారుణం జరిగింది. ఓ యువతిని బైక్ కట్టేసి ఈడ్చుకెళ్లి యువతిని హత్య చేసిన ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. ఈ దారుణ ఘటన కైముర్ జిల్లా కార్జావ్ గ్రామంలో హాటా-దుర్గావతి ప్రధాన రహదారిపై మంగళవారం జరిగింది. ఈ వివరాలను పరిశీలిస్తే.. 
 
ఫకారాబాద్ గ్రామానికి చెందిన టెన్త్ విద్యార్థిని తన ముగ్గురు స్నేహితురాళ్లతో కలిసి అర్థ సంవత్సర పరీక్షలు రాసేందుకు వెళుతుండగా బైకుపై వచ్చిన ముగ్గురు దుండగులు ఆమె దుప్పటా(చున్నీ) పట్టుకుని లాగారు. మెడకు చున్నీ చుట్టకుని ఆమె కింద పడిపోయింది. 
 
ఆమెను బైకుతో 50 మీటర్ల వరకు ఈడ్చుకుపోయారు. అక్కడితో ఆగకుండా ఆమెపై నుంచి బైకు నడిపారు. తీవ్రగాయాలతో బాధితురాలు సంఘటనా స్థలంలోనే ప్రాణాలు కోల్పోయింది. బైకు గోతిలో పడి ముగ్గురు దుండగులు కిందపడిపోయారు. వీరిని స్థానికులు పట్టుకోవడానికి ప్రయత్నించడంతో బైకు అక్కడే వదిలేసి పారిపోయారు.
 
ఈ ఘటనపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. బాలిక మృతదేహంతో రోడ్డుపైనే బైఠాయించారు. హంతకులను అరెస్ట్ చేసి, కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. మృతురాలి తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితులను పట్టుకునేందుకు రెండు పోలీసు బృందాలను ఏర్పాటు చేసినట్టు ఏఎస్పీ తెలిపారు. 

పవన్ కల్యాణ్‌పై షాకింగ్ కామెంట్స్ చేసిన రేణు దేశాయ్

మ్యూజిక్ షాప్ మూర్తి నుంచి రాహుల్ సిప్లిగంజ్ పాడిన అంగ్రేజీ బీట్ లిరికల్ వచ్చేసింది

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆహ్వానించిన దర్శకుల సంఘం

రోడ్డు ప్రమాదంలో పవిత్ర మృతి.. త్రినయని నటుడు చంద్రకాంత్ ఆత్మహత్య

రాహుల్ విజయ్, శివాని ల విద్య వాసుల అహం ఎలా ఉందంటే.. రివ్యూ

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments