Webdunia - Bharat's app for daily news and videos

Install App

లెక్కలు చదువుకోమన్నారని తల్లిదండ్రుల్ని చంపేశాడు.. ప్రియురాల్ని పాతేశాడు.. ఆపై 200 ఎఫ్‌బీ ఖాతాలు ఓపెన్ చేసి..?

మహిళలపై ప్రేమోన్మాదులు, కామాంధుల దుశ్చర్యలు పెచ్చరిల్లిపోతున్నాయి. ఇటీవల ప్రియురాలిని చంపి ఇంట్లోనే పాతిపెట్టిన కేసులో భోపాల్‌కు చెందిన ఉదయన్ దాస్ అనే వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే ఈ నిందిత

Webdunia
శుక్రవారం, 10 ఫిబ్రవరి 2017 (14:34 IST)
మహిళలపై ప్రేమోన్మాదులు, కామాంధుల దుశ్చర్యలు పెచ్చరిల్లిపోతున్నాయి. ఇటీవల ప్రియురాలిని చంపి ఇంట్లోనే పాతిపెట్టిన కేసులో భోపాల్‌కు చెందిన ఉదయన్ దాస్ అనే వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే ఈ నిందితుడు గతంలో తన తల్లిదండ్రులను హతమార్చినట్లు పోలీసుల విచారణలో తేలింది.

గణితం బాగా చదువుకోమని అప్పుడప్పుడు కోప్పడేవారని.. అది తనకు నచ్చక వారిని హతమార్చినట్లు పోలీసుల ఎదుట ఉదయన్ దాస్ అంగీకరించాడు. తల్లిదండ్రులను మిస్టర్‌ అండ్‌ మిసెస్‌ హిట్లర్‌ అని అభివర్ణించాడు. తనకిష్టంలేని పనులు చేయించినందుకే వారిని చంపేశానని, అందుకు తనకేమాత్రం బాధ, పశ్చాత్తాపం లేవని చెప్పాడు.
 
రాయ్‌పూర్‌ పోలీసులు ఉదయన్‌ని విచారించిన నేపథ్యంలో ఈ విషయాలన్నీ వెల్లడయ్యాయి. తల్లిదండ్రులను హతమార్చి, నకిలీ మరణధృవీకరణ పత్రాలతో వారి పేరిట ఉన్న ఆస్తులను అమ్మి డబ్బు జమ చేసుకున్న ఉదయన్‌ ఆ డబ్బుతో విలాస జీవితం ప్రారంభించాడు.

దాదాపు 200 ఫేస్‌బుక్‌ ఖాతాలు తెరచి వాటి ద్వారా అమ్మాయిలతో పరిచయం పెంచుకున్నాడు. ఎన్నారైనని.. ఒబామా, ట్రంప్ వంటి వారితో సంబంధాలున్నాయని.. మార్ఫింగ్ చేసిన ఫోటోలతో ఏమార్చేవాడని పోలీసులు చెప్పారు. ఉదయన్‌ నోటివెంట ఇదంతా విన్న పోలీసులు అతడిని సైకోగా భావిస్తున్నారు. కేసు దర్యాప్తును కొనసాగిస్తున్నట్లు తెలిపారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రాజ్ తరుణ్-లావణ్య కేసు- హార్డ్ డిస్క్‌లో 200కి పైగా వీడియోలు

ఎండ్‌కార్డు వరకు సస్పెన్స్ కొనసాగుతుంది - 'ఒక పథకం ప్రకారం' డైరెక్టర్ వినోద్ కుమార్ విజయన్

లావణ్య త్రిపాఠి ప్రధాన పాత్రలో 'సతి లీలావతి'

'గేమ్ ఛేంజర్' కలెక్షన్లపై అల్లు అరవింద్ సెటైర్లు - ముందుంది మొసళ్ల పండుగ అంటున్న మెగాఫ్యాన్స్!

ఫస్ట్ లుక్ లాంచ్ ఈవెంట్‌లో హీరోయిన్ అర్చన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

దేశానికి సవాల్ విసురుతున్న కేన్సర్ - ముందే గుర్తిస్తే సరేసరి.. లేదంటే...

లొట్టలు వేస్తూ మైసూర్ బోండా తినేవాళ్లు తెలుసుకోవాల్సినవి

2025 వెడ్డింగ్ కలెక్షన్‌ను లాంచ్ చేసిన తస్వ ఎక్స్ తరుణ్ తహిలియాని

ఆకాకర ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

కేన్సర్ జీనోమ్ డేటాబేస్‌ను ప్రారంభించిన ఐఐటీ-మద్రాస్

తర్వాతి కథనం
Show comments