Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేనే 'అమ్మ' కుమార్తెను.. డీఎన్ఏ టెస్ట్ చేసుకోండి...

తమిళనాడు ముఖ్యమంత్రి దివంగత జయలలిత, సినీ నటుడు శోభన్ బాబుకు మధ్య ప్రేమాయణం సాగినట్టు రూమర్స్ ఉన్నాయి. వీరిద్దరికి ఓ కుమార్తె పుట్టిందనీ, ఆమె లండన్‌లో చదువుతున్నారంటూ అప్పట్లో వార్తలు కూడా వచ్చాయి.

Webdunia
సోమవారం, 27 నవంబరు 2017 (18:14 IST)
తమిళనాడు ముఖ్యమంత్రి దివంగత జయలలిత, సినీ నటుడు శోభన్ బాబుకు మధ్య ప్రేమాయణం సాగినట్టు రూమర్స్ ఉన్నాయి. వీరిద్దరికి ఓ కుమార్తె పుట్టిందనీ, ఆమె లండన్‌లో చదువుతున్నారంటూ అప్పట్లో వార్తలు కూడా వచ్చాయి. అయితే ఇపుడు ఈ వార్తలను నిజం చేస్తూ బెంగుళూరుకు చెందిన ఓ మహిళ ముందుకు వచ్చారు. తానే జయలలిత కుమార్తెను కావాలంటే డీఎన్ఏ టెస్ట్ చేసుకోండంటూ సవాల్ విసురుతోంది. ఇందుకోసం ఆమె న్యాయ పోరాటం సైతం చేస్తోంది. 
 
జయలలిత వారసురాలినంటూ చెప్పుకుంటున్న ఆ యువతి పేరు అమృత సారథి అలియాస్ మంజుల. వయసు 37. ఈమె సుప్రీంకోర్టులో ఒక పిటీషన్ దాఖలు చేసింది. తాను జయలలిత కూతురునని… కావాలంటే తనకు డీఎన్‌ఏ పరీక్ష నిర్వహించవచ్చునని కోరింది. 'నేను జయలలిత కూతుర్నే. జయలలిత సోదరి నన్ను పెంచి పెద్ద చేశారు. జయలలిత మృతి చెందిన తర్వాత నాకు ఈ రహస్యాన్ని చెప్పారు' అని పేర్కొంది. ఈ పిటీషన్‌ను పరిశీలించిన కోర్టు తోసిపుచ్చింది. పైగా, కర్ణాటక హైకోర్టుకు వెళ్లకుండా నేరుగా సుప్రీంకోర్టు ఎందుకొచ్చారంటూ కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.
 
కాగా, గత యేడాది డిసెంబరు నెలలో అనారోగ్యంతో ప్రాణాలు విడిచిన జయలలిత జీవితాంతం పెళ్లి చేసుకోకుండా అవివాహితగానే ఉండిపోయారు. పైగా, ఆమె వ్యక్తిగత జీవితం గురించి ఎవరికీ పెద్దగా తెలియదు. ఈ క్రమలోనే జయ మృతి చెంది ఏడాది కావస్తున్న తర్వాత కూడా ఆమె వారసులం తామంటే తామేనంటూ.. పలువురు ముందుకొస్తున్నారు. గతంలో కూడా కొందరు కోర్టుల్లో పిటిషన్లు వేశారు. ఈ కోవలోనే మంజలు కూడా పిటీషన్ దాఖలు చేసినట్టు పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హోం టౌన్ సిరీస్ చూస్తే మీ సొంతూరు గుర్తుకువస్తుంది - రాజీవ్ కనకాల

విడుదలకు సిద్ధమవుతున్న సుమయ రెడ్డి నటించిన డియర్ ఉమ చిత్రం

హన్సికపై గృహహింస కేసు ... కొట్టివేయాలంటూ హైకోర్టులో పిటిషన్

అఖండ 2 తాండవంలో శివతత్త్వం చెబుతున్న బోయపాటి

టిల్లు సిరీస్‌లా జాక్ సిరీస్‌కు ప్లాన్ చేసిన దర్శకుడు భాస్కర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

కిడ్నీ స్టోన్స్ తగ్గించేందుకు సింపుల్ టిప్స్

వేసవిలో లోదుస్తులు బిగుతుగా ధరించారంటే? రాత్రిపూట వేసుకోవద్దు..

వారానికి మూడు రోజుల పాటు కొబ్బరి నీళ్లు తాగితే?

హింద్‌వేర్ స్మార్ట్ అప్లయెన్సెస్ వారి మార్కస్ 80 బిల్ట్-ఇన్ ఓవెన్‌తో వంట

తర్వాతి కథనం
Show comments