Webdunia - Bharat's app for daily news and videos

Install App

కారులోంచి దిగి బస్కెక్కుతావా... చావు.. కాల్చిపడేసిన భార్య.. ఔరా..

అసలే కోతి.. ఆపై కల్లు దాగింది. తర్వాత చెట్టెక్కింది.. ఆపై పూనకం వచ్చింది అనేంత రేంజిలో ఒక భార్య పుల్లుగా తాగి భర్తతో గొడవ పడి మూడు సార్లు కాల్చిపడేసింది. చావుబతుకుల మధ్య అతడు ఆసుపత్రిలో ఉంటే పోలీసులు ఈ కేసును ఎలా తేల్చాలా అని మల్లగుల్లాలు పడుతున్నార

Webdunia
శనివారం, 6 మే 2017 (09:22 IST)
అసలే కోతి.. ఆపై కల్లు దాగింది. తర్వాత చెట్టెక్కింది.. ఆపై పూనకం వచ్చింది అనేంత రేంజిలో ఒక భార్య పుల్లుగా తాగి భర్తతో గొడవ పడి మూడు సార్లు కాల్చిపడేసింది. చావుబతుకుల మధ్య అతడు ఆసుపత్రిలో ఉంటే పోలీసులు ఈ కేసును ఎలా తేల్చాలా అని మల్లగుల్లాలు పడుతున్నారు. 
 
ఈ ఘటన శుక్రవారం సాయంత్రం బెంగళూరులోని హెబ్బగోడి సమీపంలోని విరసంద్ర గేట్‌ వద్ద చోటు చేసుకుంది. హెచ్‌ఎస్‌ఆర్‌ లేఔట్‌లోని హరళూరులో సాయిరామ్, హంసవేణి దంపతులు నివాసం ఉంటున్నారు. 
సాయిరామ్‌(53) సెక్యూరిటీ ఏజెన్సీ సీఈఓగా పనిచేస్తున్నాడు. చందాపుర సమీపంలోని మ్యాక్స్‌ రెసిడెన్సిలో శుక్రవారం సాయంత్రం సాయిరామ్ దంపతులు మద్యం సేవించి కారులో బయల్దేరారు. 
 
మార్గం మధ్యలో ఏదో విషయంపై ఇద్దరి మధ్య గొడవ మొదలైంది. దీంతో వాహనం వీరసంద్ర గేట్‌ సమీపంలోకి రాగానే భర్త సాయిరామ్‌ కారు దిగి  బీఎంటీసీ బస్సు ఎక్కాడు. ఇక అంతే.. ఆగ్రహించిన భార్య కారును వేగంగా బస్సు ముందుకు తీసుకొచ్చి ఆపింది. భర్తను బలవంతంగా బస్సునుంచి కిందకు దింపి రివాల్వర్‌తో మూడుసార్లు కాల్పులు జరిపింది. దీంతో మూడు బుల్లెట్లు  కడుపు, ఎద బాగంలో దూసుకెళ్లాయి.
 
స్థానికులు ఆమెను నిలువరింపేందుకు యత్నించగా వారిపై రివాల్వార్‌ ఎక్కు పెట్టి మిమ్మల్ని కూడా కాల్చిపారేస్తానంటూ బెదిరించింది. అప్పటికే అక్కడకు చేరుకున్న ఎలక్ట్రానిక్‌ సిటీ పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకొని రివాల్వార్‌ స్వాధీనం చేసుకొన్నారు. గాయపడిన సాయిరామ్‌ను చికిత్స నిమిత్తం స్పర్శా ఆస్పత్రికి తరలించారు. సాయిరామ్‌కు శస్త్ర చికిత్సలు చేస్తున్నట్లు వైద్యులు తెలిపారు. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేస్తున్నారు.
 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Allu Arjun : 21 ఏళ్ళకు ఎంట్రీ, 22 ఏళ్ళ కెరీర్ లో ఎత్తుపల్లాలు చూసిన బన్నీ

మాతృ మూవీ లో చూస్తున్నవేమో.. పాటను అభినందించిన తమ్మారెడ్డి భరద్వాజ్

Mad Square Review : మ్యాడ్ స్క్వేర్ రివ్యూ

Photos in Sydney: ఫోటోలను క్లిక్ మనిపించింది ఎవరు..? సమంత సమాధానం ఏంటంటే?

రేపటి నుండి మ్యాడ్ స్వ్కేర్ స్క్రీనింగ్ లలో కింగ్ డమ్ టీజర్ ఎట్రాక్షన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

Green Peas: పచ్చి బఠానీలను ఎవరు తినకూడదో తెలుసా?

Jaggery Tea : మధుమేహ వ్యాధిగ్రస్తులు బెల్లం టీ తాగవచ్చా?

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

Healthy diet For Kids: పిల్లల ఆహారంలో పోషకాహారం.. ఎలాంటి ఫుడ్ ఇవ్వాలి..

తర్వాతి కథనం
Show comments