Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఒకప్పుడు సెక్స్ వర్కర్.. నేడు గౌరవ డాక్టర్.. దేశంలోనే తొలి ట్రాన్స్‌జెండర్

దేశంలోనే తొలిసారిగా ఓ ట్రాన్స్‌జెండర్ గౌరవ డాక్టరేట్‌ను అందుకుంది. ఈ తరహా డాక్టరేట్‌ను అందుకోవడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. ఆమె పేరు అక్కై పద్మశాని. సామాజిక కార్యకర్త.

Webdunia
సోమవారం, 6 జూన్ 2016 (14:25 IST)
దేశంలోనే తొలిసారిగా ఓ ట్రాన్స్‌జెండర్ గౌరవ డాక్టరేట్‌ను అందుకుంది. ఈ తరహా డాక్టరేట్‌ను అందుకోవడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. ఆమె పేరు అక్కై పద్మశాని. సామాజిక కార్యకర్త. ఈమె ఇండియన్ వర్చువల్ యూనివర్సిటీ ఫర్ పీస్ అండ్ ఎడ్యుకేషన్(ఐవీయూపీ) సంస్థ నుంచి డాక్టరేట్‌ను స్వీకరించారు. 
 
ఈ సందర్భంగా అక్కై పద్మశాలి మాట్లాడుతూ గౌరవ డాక్టరేట్ రావడం సంతోషంగా ఉందన్నారు. డాక్టరేట్ తనకు వస్తుందని ఊహించలేదని భావోద్వేగానికి లోనయ్యారు. డాక్టరేట్‌తో గౌరవిస్తున్నామని ఐవీయూపీ సంస్థ చెప్పినప్పుడు.. పదో తరగతి ఫెయిలైన తనకు డాక్టరేట్ ఇవ్వడం ఏంటని ప్రశ్నించుకున్నాని పేర్కొన్నారు. 
 
సామాజిక కార్యకర్తగా ట్రాన్స్‌జెండర్లకు సేవలు అందిస్తున్నందుకు గానూ డాక్టరేట్ ఇస్తున్నామని ఐవీయూపీ సంస్థ తెలిపిందన్నారు. బెంగళూరులో మధ్యతరగతి కుటుంబంలో పుట్టిన పద్మశాలి తనకు 16వ సంవత్సరం వచ్చే వరకు అబ్బాయిగా ఉన్నాడు. అనంతరం అమ్మాయిగా మారాడు. కొద్ది కాలం పాటు సెక్స్ వర్కర్‌గా పని చేశాక ఓ స్వచ్ఛంద సంస్థలో చేరి తనలాంటి ట్రాన్స్‌జెండర్లకు సేవలందిస్తున్నారు. 

సినారేకు నివాళిగా రాబోతున్న "నా ఉచ్ఛ్వాసం కవనం" ప్రోగ్రాం కర్టెన్ రైజర్ కార్యక్రమం

కౌంట్‌డౌన్ ప్రారంభం: మాగ్నమ్ ఓపస్ 'కల్కి 2898 AD' అప్‌డేట్

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

తర్వాతి కథనం