Webdunia - Bharat's app for daily news and videos

Install App

భర్త ఆరు పెగ్గులు, నేను బీర్లు తాగా.. తాగి కొడుతుంటే.. ఆత్మరక్షణ కోసం కాల్చేశాను!

బెంగుళూరులో భర్తను తుపాకీతో కాల్చిన కేసులో మహిళా నిందితురాలిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆమె వద్ద జరిపిన విచారణలో ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. బొమ్మనహళ్లి ప్రాంతానికి చెందిన హంసవేణి.. భర

Webdunia
ఆదివారం, 7 మే 2017 (12:29 IST)
బెంగుళూరులో భర్తను తుపాకీతో కాల్చిన కేసులో మహిళా నిందితురాలిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆమె వద్ద జరిపిన విచారణలో ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. బొమ్మనహళ్లి ప్రాంతానికి చెందిన హంసవేణి.. భర్త సాయిరామ్‌పై కాల్పులు జరిపిన విషయం తెల్సిదే. తాగిన మైకంలో భర్త కొడుతుంటే నన్ను నేను రక్షించుకోవడం కోసం ఫైరింగ్‌ చేశానని చెప్పింది. శనివారం విచారణ కోసం చందాపుర సమీపంలోఉన్న సూర్య సిటీ పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా, ఆ విధంగా చెప్పారు.
 
'బ్యాంకు పని మీద నేను, నా భర్త సాయిరామ్‌‌తో కలిసి హోసూరు వెళ్ళి హరళూరులో ఉన్న మా నివాసానికి తిరిగి వస్తున్నా. చందాపుర సమీపంలో రెస్టారెంటులో ఇద్దరం మద్యం తాగాం. భర్త ఆరు పెగ్గుల విస్కీ, నేను రెండు బీర్లు తాగాను. మద్యం తాగుతున్న సమయంలోనే మా ఇద్దరి మధ్య గొడవైంది. రెస్టారెంటులోనే రివాల్వర్‌ తీసి నా ముఖం మీద కొట్టాడు. దాంతో నాకు నోట్లోంచి, ముక్కులో నుంచి రక్తం వచ్చింది. కారులో వెళ్తుంటే మళ్లీ గొడవైంది. నన్ను నేను రక్షించుకోవడం కోసం కాల్పులు జరిపాను. నాది బెంగళూరు, నా భర్తది ఆంధ్రప్రదేశ్‌. 27 ఏళ్ల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్నాం. మా ఇద్దరివీ శ్రీమంతుల కుటుంబాలు కావడంతో ఇద్దరం కలిసి మందు తాగుతాం'  అని హంసవేణి చెప్పుకొచ్చింది. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రామ్ చరణ్ తాజా టైటిల్ పెద్ది - మైసూర్ లో యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణ?

విజయ్ దేవరకొండ రౌడీ వేర్ బ్రాండ్ కు ఔట్ లుక్ ఇండియా బిజినెస్ అవార్డ్

వికటకవి చూసి గర్వంగా అనిపించింది.. నిర్మాత రామ్ తాళ్లూరి

రామ్ పోతినేని సినిమాకు తమిళ సంగీత ద్వయం వివేక్ - మెర్విన్

ఉజ్జయిని మహాకాళేశ్వర్ టెంపుల్ సాక్షిగా కన్నప్ప రిలీజ్ డేట్ ప్రకటన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శ్వాసకోశ సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

బార్లీ వాటర్ ఎందుకు తాగాలి? ప్రయోజనాలు ఏమిటి?

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

బాదంపప్పులను తింటుంటే వ్యాయామం తర్వాత త్వరగా కోలుకోవడం సాధ్యపడుతుందంటున్న పరిశోధనలు

సింక్రోనస్ ప్రైమరీ డ్యూయల్ క్యాన్సర్‌లకు అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విజయవంతమైన చికిత్స

తర్వాతి కథనం
Show comments