Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎంత పని చేశావు లిడియా? ప్రియుడు ఒప్పుకోలేదని యాసిడ్ దాడి, బ్లేడుతో పీక కోయాలని....

ప్రేమోన్మాదులు అమ్మాయిలపై దాడులు చేయడం, యాసిడ్ దాడులు చేయడం, హత్యలు చేయడం... తదితర వార్తలను మనం చూస్తుంటాం. కానీ ఇక్కడ సీన్ రివర్స్ అయ్యింది. తన ప్రియుడు చెప్పిన మాట వినలేదనే కసితో ఓ ప్రియురాలు ఎంచుకున్న మార్గం చూస్తే గుండె గుభేలుమంటుంది. బెంగళూరులో

Webdunia
బుధవారం, 18 జనవరి 2017 (16:34 IST)
ప్రేమోన్మాదులు అమ్మాయిలపై దాడులు చేయడం, యాసిడ్ దాడులు చేయడం, హత్యలు చేయడం... తదితర వార్తలను మనం చూస్తుంటాం. కానీ ఇక్కడ సీన్ రివర్స్ అయ్యింది. తన ప్రియుడు చెప్పిన మాట వినలేదనే కసితో ఓ ప్రియురాలు ఎంచుకున్న మార్గం చూస్తే గుండె గుభేలుమంటుంది. బెంగళూరులో జరిగిన ఈ ఘటన వివరాలు ఇలా వున్నాయి.
 
26 ఏళ్ల లిడియా ఓ ప్రైవేటు ఆసుపత్రిలో నర్సుగా పనిచేస్తోంది. బట్టల దుకాణం నడిపే 32 ఏళ్ల జయకుమార్ తో మాట కలిసింది. ఇద్దరూ ప్రేమించుకున్నారు. ఈ క్రమంలో ఇద్దరం పెళ్లాడుదామంటూ అతడిని అడిగింది. జయకుమార్ ఓకే అన్నాడు. ఐతే ఇంతలోనే ఓ ట్విస్టు ఇచ్చింది. తనను పెళ్లాడాలంటే తన మతంలోకి మారాలని కోరింది. అందుకు జయకుమార్ అంగీకరించలేదు. పెళ్లి చేసుకుంటాను తప్పించి మతం మారేది లేదని స్పష్టం చేశాడు. దీనితో లిడియా కసి పెంచుకుంది. 
 
పైగా తనను కాదన్న జయకుమార్ మరో అమ్మాయిని పెళ్లాడేందుకు సిద్ధమవుతున్నట్లు వార్తలు తెలుసుకుంది. అతడిని ఎలాగైనా హత్య చేయాలని తన సమీప బంధువుడిని ఒకడిని వెంటబెట్టుకుని గుడికి వెళ్లి వస్తున్న జయకుమార్ పైన యాసిడ్ దాడి చేసింది. అతడు కింద పడగానే బ్లేడుతో అతడి గొంతు కోసేందుకు ప్రయత్నం చేసింది. ఐతే ఇంతలో జనం పెద్దఎత్తున గుమిగూడటంతో ఆమె ప్లాన్ రివర్స్ అయ్యింది. గాయాలపాలైన జయకుమార్ ను స్థానికులు ఆసుపత్రికి తరలించారు. లిడియాను హత్యా యత్నం నేరం కింద పోలీసులు అరెస్టు చేశారు.

ఎం.ఎల్.ఎ.లను కిడ్నాప్ చేసిన రామ్ చరణ్ - తాజా అప్ డేట్

దేవర లో 19 న ఎర్రసముద్రం ఎగిసెగిసిపడుద్ది : రామ జోగయ్యశాస్త్రి

సుచి లీక్స్ గోల.. ధనుష్, త్రిషనే కాదు.. మాజీ భర్తను కూడా వదిలిపెట్టలేదు..

పుష్ప2 నుంచి దాక్షాయణి గా అనసూయ తిరిగి రానుంది

థియేటర్ల మూత అనంతరం డైరెక్టర్స్ అసోసియేషన్ ఈవెంట్

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

మెదడు ఆరోగ్యంపై ప్రభావం చూపే శారీరక శ్రమ

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

పిల్లల మానసిక ఆరోగ్యానికి దెబ్బతీసే జంక్ ఫుడ్.. ఎలా?

తర్వాతి కథనం
Show comments