పేరుకే ఆటో డ్రైవర్.. వామ్మో కోటి రూపాయల విల్లాలో వుంటున్నాడు..

Webdunia
శుక్రవారం, 3 మే 2019 (16:09 IST)
బెంగళూరు ఆటో డ్రైవర్ రూ.1.6కోట్ల విలువ చేసే విల్లాను కొనడం ప్రస్తుతం చర్చనీయాంశమైంది. ఓ ఆటో డ్రైవర్ కోటి విలువ చేసే విల్లాను ఎలా కొన్నాడబ్బా అంటూ ప్రతి ఒక్కరూ చర్చించుకుంటున్నారు. అయితే ఈ వ్యవహారాన్ని ఐటీ శాఖ బహిర్గతం చేసింది. ఐటీ దాడుల్లో ఆటో డ్రైవర్ విల్లాలో వుంటున్న విషయం వెల్లడి అయ్యింది. 
 
ఇంకా అతని ఇంట జరిపిన సోదాల్లో ఒక్కొక్కటిగా నిజాలు బయటపడుతున్నాయి. ఒక విదేశీ మహిళకు బినామీగా పెద్దఎత్తున ఆస్తులుకూడబెట్టినట్లు తేలింది. వివరాల్లోకి వెళితే.. బెంగళూరు వైట్‌ఫీల్డ్‌లో ఆటోడ్రైవరు సుబ్రమణి నివాసం వుంటున్నాడు. ఇతని విల్లాపై ఐటీ దాడులు జరిగాయి. ఒక విదేశీమహిళ డబ్బుతో ఆటోడ్రైవరు బంగ్లా కొనుగోలు చేసినట్లు విచారణలో వెలుగుచూసింది. 
 
ఆటోడ్రైవరు సుబ్రమణి ఇంటిపై దాడిచేసిన ఐటీ అధికారులు పలు కీలకపత్రాలను స్వాధీనం చేసుకున్నారు. వాటిని పరిశీలించగా సుబ్రమణి ఒక విదేశీ మహిళకు బినామీ అని తెలిసింది. ఇతనికి రాజకీయ నాయకులతో సన్నిహిత సంబంధం వున్నట్లు ఐటీ అధికారులు అనుమానిస్తున్నారు.
 
విదేశీ మహిళతో పరిచయం ఏర్పరుచుకున్న సుబ్రమణి, ఆమె భారతదేశంలో ఆస్తిని కొనుగోలు చేయిస్తానని.. ఆమెను నమ్మించి ఆస్తులు కొనుగోలు చేయించి వుంటాడని ఐటీ అధికారులు భావిస్తున్నారు. సుబ్రమణి మాటలు నమ్మిన విదేశీ మహిళ అతడి పేరుతో ఆస్తి కొనుగోలు చేయడానికి విదేశాల నుంచి బ్యాంక్‌ ద్వారా నగదు బదిలీ చేసినట్లు విచారణలో తేలింది. దీంతో సుబ్రమణి బంగ్లా కొనుగోలు చేశాడని వెల్లడైంది. ఐటీ అధికారులు సోదాల అనంతరం సుబ్రమణికి విచారణకు రావాలని నోటీసులు జారీ చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Dhanush: కృతి స‌న‌న్ తో ప్రేమలో మోసపోయాక యుద్ధమే అంటున్న ధనుష్ - అమ‌ర‌కావ్యం (తేరే ఇష్క్ మై)

అఖండ 2 డిసెంబర్ 12న వస్తోందా నిర్మాతలు ఏమన్నారంటే?

'అఖండ్-2' ప్రీమియర్ షోలు రద్దు.. ఎందుకో తెలుసా?

సినిమా పెట్టుబడి రూ.50 లక్షలు.. 54రోజుల్లో రూ.100 కోట్ల కలెక్షన్లు

టాలీవుడ్ ప్రముఖులతో సమావేశమైన కొరియన్ డైరెక్టర్, ప్రొడ్యూసర్ యూ ఇన్-సిక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

scrub typhus fever, విశాఖలో బెంబేలెత్తిస్తున్న స్క్రబ్ టైఫస్ పురుగు కాటు జ్వరం

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

బియ్యం కడిగిన నీటిలో ధనియాలను మెత్తగా నూరి పటికబెల్లం కలిపి తింటే?

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

నిజామాబాద్‌లో విద్యార్ధుల కోసం నాట్స్ దాతృత్వం, నిర్మలా హృదయ్ హైస్కూల్‌కి డిజిటల్ బోర్డులు

తర్వాతి కథనం
Show comments