Webdunia - Bharat's app for daily news and videos

Install App

బెంగాల్‌లో దారుణం... అక్కాచెల్లెళ్లను కట్టేసి కొట్టారు.. తృణమూల్ చేతివాటం..

Webdunia
సోమవారం, 3 ఫిబ్రవరి 2020 (18:33 IST)
బెంగాల్‌లో దారుణం చోటుచేసుకుంది. మహిళలని కూడా చూడకుండా కర్కశంగా ప్రవర్తించారు. అక్కాచెల్లెళ్లను కట్టేసి నడిరోడ్డుపై కొట్టి ఈడ్చుకెళ్లి దుర్ఘటన శుక్రవారం జరిగింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. ఈ వీడియోపై నెటిజన్ల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వివరాల్లోకి వెళితే.. తమకు చెందిన భూమిలో తలపెట్టిన రోడ్డు నిర్మాణాన్ని అడ్డుకున్నారనే కారణంగా అక్కాచెల్లెళ్లను ఇలా దారుణంగా దాడి చేశారు. 
 
బాధితురాలు స్మృతి.. ఇరానీ దాస్‌ స్థానిక పాఠశాలలో ఉపాధ్యాయురాలినిగా పని చేస్తోంది. తన తల్లి, సోదరితో కలిసి ఫటా నగర్‌లో నివాసముంటోంది. గతంలో పంచాయతీ రోడ్డు నిర్మాణం కోసం వీరికి చెందిన భూమిలో కొంత భాగాన్ని అప్పగించారు. అయితే గ్రామ పంచాయతీ మరోసారి రోడ్డు వెడల్పు చేయాలని భావించగా వారు దీనికి ఒప్పుకోలేదు. దీనివల్ల తమ భూమిలో ఎక్కువ మొత్తాన్ని కోల్పోతామని ససేమిరా అన్నారు. 
 
ఇదేదీ పట్టని పంచాయతీ పెద్దలు జేసీబీతో సహా ఇంటికి చేరుకొని రోడ్డు నిర్మాణం తలపెట్టారు. దీన్ని అడ్డుకుని నిరసన తెలిపిన ఇద్దరు యువతులపై తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీ(టీఎంసీ)కి చెందిన పంచాయతీ నాయకుడు అమల్‌ సర్కార్‌, తన అనుచరులతో దాడికి తెగబడ్డాడు. అతని అనుచరులు యువతుల కాళ్లను తాళ్లతో కట్టేసి, కొట్టుకుంటూ విచక్షణారహితంగా నడిరోడ్డుపై ఈడ్చుకుంటూ వెళ్లారు. 
 
దాడిని అడ్డుకున్న సోదరిని సైతం కిందపడేసి ఇష్టమొచ్చినట్లుగా కొట్టారు. నిందితుడు ఆమె మెడలోని బంగారు గొలుసును, మొబైల్‌ ఫోన్‌ను లాక్కున్నాడు. ఇక ఈ ఘటనపై బాధితురాలు స్మృతి ఆదివారం పోలీసులకు ఫిర్యాదు చేసింది. 
 
ఈ దాడికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారడంతో టీఎంసీ అధిష్టానం నిందితుడు అమల్‌ సర్కార్‌ను పార్టీ నుంచి నిషేధిస్తున్నట్లు ప్రకటించింది. బాధితురాళ్లను 30 అడుగుల దూరం వరకు లాక్కెళ్లారని, కట్టేసి దాడి చేశారని.. ఇంకా చంపేస్తామని బెదిరించినట్లు పోలీసులు తెలిపారు. 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments