Webdunia - Bharat's app for daily news and videos

Install App

వెస్ట్ బెంగాల్ : రూ.250 కోట్ల విలువైన పాము విషం స్వాధీనం

వెస్ట్ బెంగాల్ రాష్ట్ర అటవీశాఖ అధికారులు రూ.250 కోట్ల విలువ చేసే పాము విషాన్ని స్వాధీనం చేసుకున్నారు. దీనికి సంబంధించి నలుగురు వ్యక్తులను అరెస్టుచేశారు.

Webdunia
శనివారం, 15 అక్టోబరు 2016 (14:01 IST)
వెస్ట్ బెంగాల్ రాష్ట్ర అటవీశాఖ అధికారులు రూ.250 కోట్ల విలువ చేసే పాము విషాన్ని స్వాధీనం చేసుకున్నారు. దీనికి సంబంధించి నలుగురు వ్యక్తులను అరెస్టుచేశారు. 
 
బెంగాల్‌లో పాము విషాన్ని అక్ర‌మంగా అమ్మే అంత‌రాష్ట్ర ముఠా కోసం ఆ రాష్ట్ర పోలీసులు గాలిస్తున్నారు. గతంలో పలువురిని అరెస్టు కూడా చేశారు. అయితే, తాజాగా భారీ మొత్తంలో పాము విషయాన్ని అక్రమంగా రవాణా చేస్తున్నట్టు పోలీసులకు సమాచారం వచ్చింది. 
 
దీంతో నిఘా వేసిన అటవీశాఖ అధికారులు... జ‌ల్‌పాయిగురిలోని బెల‌కోబాలో ఈ ముఠా సభ్యులను అదుపులోకి తీసుకున్నారు. వీరి నుంచి సుమారు రూ.250 కోట్ల విలువ చేసే పాము విషాన్ని స్వాధీనం చేసుకున్నారు. మొత్తం అయిదు బాటిళ్ల‌లో పాము విషాన్ని దుండ‌గలు సేక‌రించిన‌ట్లు పోలీసులు తెలిపారు. 
 
ఒక్క గ్రాము విషానికి సుమారు రూ.26 వేల ధ‌ర ప‌లుకుతుంద‌ని నిపుణులు అంటున్నారు. యాంటీ వీన‌మ్‌ను త‌యారు చేసేందుకు పాము విషాన్ని శాస్త్ర‌వేత్త‌లు, డాక్ట‌ర్లు డిమాండ్ చేస్తుంటార‌ని అట‌వీశాఖ అదికారులు భావిస్తున్నారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Retro Promotions: ఘనంగా సూర్య 'రెట్రో' ప్రీ రిలీజ్ వేడుక- విజయ్ దేవరకొండ స్పీచ్ అదుర్స్

చౌర్య పాఠం బాగుందంటున్నారు అందరూ వచ్చి చూడండి : త్రినాథరావు నక్కిన

మైథికల్ థ్రిల్లర్ జానర్‌ లో నాగ చైతన్య 24వ చిత్రం

Srinidhi Shetty: రామాయణంలో సీత క్యారెక్టర్ ని రిజెక్ట్ చేయలేదు: శ్రీనిధి శెట్టి

శర్వా, సంపత్ నంది కాంబినేషన్ చిత్రంలో నాయికగా అనుపమ పరమేశ్వరన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

'ది గ్రీన్ ఫ్లీ'ను ప్రారంభించిన ఇనార్బిట్ సైబరాబాద్

టమోటాలను తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

Annapurna yojana scheme: మహిళలకు వరం.. అన్నపూర్ణ యోజన పథకం.. షరతులు ఇవే

తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి

హైదరాబాద్‌ కొండాపూర్‌లో 3వ స్టోర్‌ను ప్రారంభించిన టిబిజెడ్-ది ఒరిజినల్

తర్వాతి కథనం
Show comments