Webdunia - Bharat's app for daily news and videos

Install App

పాము కాటు వేసిందనీ... పామును కరకర నమిలి చంపేసిన జార్ఖండ్ వాసి!

Webdunia
ఆదివారం, 15 మే 2016 (12:14 IST)
సాధారణంగా పామును చూసినా.. పాము కరిచినా ప్రాణభయంతో వణికిపోతూ.. కేకలు పెడుతుంటారు. కానీ, ఆ జార్ఖండ్ వాసి మాత్రం ఇందుకు పూర్తిగా భిన్నం. నిద్రపోతున్న సమయంలో తనను పాము కరిచిందనీ ఆగ్రహించి.. ఆ పామునే కరకర నిమిలి పారేశాడు. దీంతో ఆ పాము చనిపోగా.. అతను కూడా పాము కాటుకు గురై 12 గంటల తర్వాత చనిపోయాడు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే... 
 
జార్ఖండ్‌ రాష్ట్రంలోని లాతేహర్ జిల్లా, బరియటు గ్రామానికి చెందిన రాంతూ ఓరన్ అనే వ్యక్తి నిద్ర పోయేందుకు ఇంటి ఆరుబయట పడుకున్నాడు. అలా కన్నుమూసీ మూయగానే ఓ పాము వచ్చి కాటేసింది. అంతే... అతనికున్న మూఢ నమ్మకం ప్రకారం పామును చంపేస్తే విషం విరుగుడవుతుందని భావించి దాన్ని వెతకడం ప్రారంభించాడు. 
 
అతడికి చుట్టుపక్కల వారు తోడయ్యారు. వారంతా కలిసి పామును గుర్తించి.. ప్రాణాలతో పట్టుకున్నారు. ఆ తర్వాత రాంతూ ఓరన్ నోటితో కొరికి, నమిలుతూ పామును చంపేశాడు. ఆ తర్వాత యధావిధిగా నిద్రపోయాడు. అయితే, పాము కాటుకు గురైన ఓరన్‌ శరీరం విషం కారణంగా రంగుమారడాన్ని గుర్తించిన కుటుంబ సభ్యులు హుటాహుటిన ఆసుపత్రికి తరలించినా ప్రాణాలు మాత్రం కాపాడలేక పోయారు. 

మ్యూజిక్ షాప్ మూర్తి నుంచి రాహుల్ సిప్లిగంజ్ పాడిన అంగ్రేజీ బీట్ లిరికల్ వచ్చేసింది

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆహ్వానించిన దర్శకుల సంఘం

రోడ్డు ప్రమాదంలో పవిత్ర మృతి.. త్రినయని నటుడు చంద్రకాంత్ ఆత్మహత్య

రాహుల్ విజయ్, శివాని ల విద్య వాసుల అహం ఎలా ఉందంటే.. రివ్యూ

పాయల్ రాజ్‌ పుత్‌తో ప్రభాస్ పెళ్లి.. డార్లింగ్‌గా ఉంటాను?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments