బర్త్‌డే పార్టీకి పిలిచి... బ్యూటీషియన్ జీవితాన్ని చిదిమేసిన స్నేహితులు...

Webdunia
మంగళవారం, 8 సెప్టెంబరు 2020 (16:26 IST)
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో మరో దారుణం జరిగింది. ఓ యువతి జీవితాన్ని ఆమె స్నేహితులే చిదిమేశారు. ఆ యువతిపై స్నేహితులే బలాత్కారానికి పాల్పడ్డారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
యూపీలోని ప్రయాగ్ రాజ్‌లోని బెనిగంజ్ ప్రాంతానికి చెందిన 20 ఏళ్ల ఓ యువతి బ్యూటీషియన్‌గా పని చేస్తోంది. స్థానికంగా ఉన్న కొందరు యువకులతో ఆమెకు పరిచయం ఉంది. ఈ పరిచయమే కొంపముంచింది.
 
ఈ క్రమంలో పుట్టినరోజు పార్టీ ఉందంటూ సులేం సారాయ్ అనే స్నేహితుడు ఆమెను తన ఇంటికి పిలిచాడు. అక్కడికే ఇతర స్నేహితులు కూడా వచ్చారు. కేక్ కటింగ్ పూర్తయిన తర్వాత అందరూ కలిసి మద్యం సేవించారు. వారితో కలిసి ఆ యువతి కూడా మద్యం తీసుకుంది. దీంతో ఆ యువతి మత్తులోకి జారుకుంది. 
 
ఆ తర్వాత మత్తులో ఉన్న స్నేహితులంతా కలిసి ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. మత్తు నుంచి తేరుకున్న తర్వాత ఆమెకు ఏం జరిగిందో అర్థమైంది. నేరుగా పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేసింది. అక్కడకు పోలీసులు వెళ్లేసరికి నిందితులు అక్కడి నుంచి పరారయ్యారు. కేసు నమోదు చేసిన పోలీసులు వారిని పట్టుకునే పనిలో నిమగ్నమయ్యారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Varanasi: వారణాసిలో జూనియర్ ఎన్టీఆర్ కుమారుడు భార్గవ్.. రోల్ ఏంటో తెలుసా?

ఆస్కార్స్ 2026లో ఉత్తమ యానిమేటెడ్ ఫీచర్ విభాగంలో మహావతార్ నరసింహ

Anupama: అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ యాక్ష‌న్ కామెడీ ది పెట్ డిటెక్టివ్‌ జీ 5లో

Balakrishna: హిస్టారికల్ ఎపిక్ నేపథ్యంలో నందమూరి బాలకృష్ణ NBK111 గ్రాండ్ గా లాంచ్

నిజాయితీ కి సక్సెస్ వస్తుందని రాజు వెడ్స్ రాంబాయి నిరూపించింది : శ్రీ విష్ణు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్ వున్నవారు తెలుసుకోవాల్సిన విషయాలు

Mint For Weight Loss: మహిళలు ఈజీగా బరువు తగ్గాలంటే.. పుదీనాను ఇలా వాడాలట..

భారతదేశంలో ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ బాధిత రోగులలో జీవించే అవకాశాలు కేవలం 3 శాతం మాత్రమే.. కానీ...

పెద్దపేగు కేన్సర్‌కు చెక్ పెట్టే తోక మిరియాలు

నెక్స్ట్-జెన్ AIతో జనరల్ ఇమేజింగ్‌: R20 అల్ట్రాసౌండ్ సిస్టమ్‌ను ప్రారంభించిన శామ్‌సంగ్

తర్వాతి కథనం
Show comments