Webdunia - Bharat's app for daily news and videos

Install App

పోర్న్‌సైట్లు చూడాలా...? ఇక అదంత సులువు కాదు..! 4860 సైట్లపై కేంద్రం వేటు? ఎలా?

Webdunia
సోమవారం, 3 ఆగస్టు 2015 (07:17 IST)
అంతర్జాల అశ్లీలంపై కేంద్రం వేటు వేసింది. అశ్లీలాన్ని వీక్షించడం ఇకపై సాధ్యం కాదు. దాదాపు 4860  వెబ్‌సైట్లపై కేంద్రం కొరడా ఝళిపిచింది. ఇంటర్నెట్‌ సర్వీస్‌ప్రొవైడర్ల (ఐఎసీల) ద్వారా వాటిని బ్లాక్‌ చేసింది. ఆదివారం తెల్లవారుజాము నుంచే ఈ చర్యలు మొదలయ్యాయి. అశ్లీల వెబ్‌సైట్లు, చిత్రాలను అరికట్టడంలో ఇది తొలి చర్యగా కేంద్రం భావిస్తోంది. 
 
రకరకాల వాదనల నేపథ్యంలో కేంద్రం వ్యూహాత్మకంగా వెబ్‌సైట్ల నిషేధం జోలికి వెళ్లకుండా సర్వీస్‌ ప్రొవైడర్ల ద్వారా కట్టడి చేయాలని నాలుగు రోజుల క్రితం ఢిల్లీలో జరిగిన ఓ సమావేశంలో కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ నిర్ణయించింది. ఈ మేరకు దేశంలోని 32 ఐఎస్పీలతో సమావేశం ఏర్పాటు చేసింది. పోర్న్‌‌సైట్స్‌ను బ్లాక్‌ చేయాలని వాటిని ఆదేశించింది. ఈ మేరకు ఆదివారం తెల్లవారుజాము నుంచే, ప్రభుత్వ రంగానికి చెందిన బీఎస్‌ఎన్‌ఎల్‌, ఎంటీఎన్‌ఎల్‌, ప్రైవేటు రంగంలోని యాక్ట్‌, హాత్‌వే, వొడాఫోన్‌, రెడ్‌ జింజర్‌,  ఆసియానెట్‌ వంటి ఐఎస్పీలు పోర్న్‌‌సైట్స్‌ను బ్లాక్‌ చేశాయి. 
 
కానీ, ఎంటీఎస్‌, ఎయిర్‌టెల్‌ వంటి ఐఎస్‌పీలు మాత్రం పోర్న్‌‌సైట్లను బ్లాక్‌ చేయలేదు. దీంతో ఈ సంస్థల ద్వారా ఇంటర్నెట్‌ పొందుతున్న వారు ఆ సైట్స్‌ను చూడగలుతున్నారు. పోర్న్‌సైట్స్‌ను బ్లాక్‌ చేయాలంటూ లిఖితపూర్వకంగా ఆదేశాలు ఇవ్వాలని ఈ సంస్థలు కేంద్రాన్ని కోరుతుండడం విశేషం.  

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?