Webdunia - Bharat's app for daily news and videos

Install App

పిడుగులాంటి వార్త వినిపించిన సుప్రీంకోర్టు.. దేశ వ్యాప్తంగా బాణాసంచా నిషేధం

crackers
Webdunia
మంగళవారం, 7 నవంబరు 2023 (23:02 IST)
దీపావళి పండుగకు ముందు సుప్రీంకోర్టు పిడుగులాంటి వార్తను వినిపించింది. దేశ వ్యాప్తంగా బాణాసంచా పేలుళ్లను నిషేధించింది. గతంలో తాము నేషనల్ క్యాపిటల్ రీజియన్ (ఎన్.సీ.ఆర్) పరిధిలో బాణాసంచా పేల్చకుండా చేసిన ఉత్తర్వులు దేశంలోని అన్ని రాష్ట్రాలు వర్తిస్తాయని తాజాగా స్పష్టం చేసింది. ఈ మేరకు బాణాసంచా కాల్పులపై అన్ని రాష్ట్రాలు తగిన చర్యలు తీసుకోవాలని సూచన చేసింది. 
 
అతి తక్కువ కాలుష్య ఉద్గారాలు, వాయు, శబ్ద కాలుష్యం విడుదల చేసే పర్యావరణహిత బాణసంచాను మాత్రమే అనుమతిస్తూ గతంలో ఇచ్చిన ఆదేశాలు అన్ని రాష్ట్రాలకు వర్తిస్తాయని పేర్కొంది. పర్యావరణాన్ని కాపాడటం ప్రతిఒక్కరి బాధ్యత అని ఈ సందర్భంగా సుప్రీం కోర్టు వ్యాఖ్యానించింది.
 
పండుగల సమయంలో వాయు, శబ్ధ కాలుష్యాన్ని తగ్గించడంపై గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలు అమలు చేసేలా రాజస్థాన్ ప్రభుత్వానికి ఆదేశించాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. దీన్ని జస్టిస్ ఏఎస్ బోపన్న, జస్టిస్ ఎంఎం సుందరేష్‌‌ల ధర్మాసనం విచారించింది. ఈ సందర్భంగా కొత్తగా ఎటువంటి ఆదేశాలు అవసరం లేదని తెలిపింది. 
 
బాణసంచాలో బేరియం సహా.. నిషేధిత రసాయనాల వాడకానికి వ్యతిరేకంగా గతంలో ఇచ్చిన ఆదేశాలు దేశమంతటా వర్తిస్తాయని.. వాటిని నిర్దిష్టంగా గమనించాలని రాజస్థాన్ ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. బాణసంచాలో నిషేధిత రసాయనాలను ఉపయోగించరాదని 2021లో సుప్రీంకోర్టు ఆదేశించింది. 
 
2018లో సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను అనుసరించి గ్రీన్ క్రాకర్స్ అనుమతి ఉందని స్పష్టం చేసింది. వాటిని కూడా దీపావళి వంటి పర్వదినాల్లో రాత్రి 8 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు మాత్రమే కాల్చుకోవచ్చని తెలిపింది. ఏదైనా నిషేధిత రసాయనాలతో నిర్దిష్ట ప్రాంతంలో తయారు చేయడం, విక్రయించడం, ఉపయోగిస్తున్నట్లు తేలితే సంబంధిత రాష్ట్రాలే బాధ్యులని స్పష్టం చేసింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దర్శక దిగ్గజం భారతీరాజా కుమారుడు మనోజ్ హఠాన్మరణం

రామ్ చరణ్‌తో మళ్లీ రొమాన్స్ చేస్తారా? సమంత ఏం చెప్పిందో తెలుసా? (video)

Charan: రామ్ చరణ్ పుట్టినరోజున పెద్ది టైటిల్ ప్రకటిస్తారా? - తాజా అప్ డేట్

బ్యూటీ భామ నీలఖికి యంగ్ సెన్సేషన్ అవార్డ్

కన్నప్ప లో మల్లు పాత్రలో నటించిన రఘు బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మధుమేహ వ్యాధిగ్రస్తులు పుచ్చకాయ తినవచ్చా?

హెచ్ అండ్ ఎం నుంచి మహిళల కోసం సరికొత్త ఫ్యాషన్ దుస్తులు

రోజుకు ఒక గుప్పెడు కాలిఫోర్నియా బాదం పప్పులు తినండి

Coffee: చెడు కొలెస్ట్రాల్ స్థాయిని పెంచేసే కాఫీ.. ఎక్కువ తాగితే?

ఆలివ్ ఆయిల్ ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments