విగ్గు పెట్టుకుని నిశ్చితార్థం.. రెండో పెళ్లి.. అసలు విషయం తెలిసేసరికి..? (video)

Webdunia
గురువారం, 13 జులై 2023 (11:07 IST)
groom
బట్టతలను దాచి విగ్గు ధరించి పెళ్లి చేసుకోవాలనుకున్న వ్యక్తికి చుక్కలు కనిపించాయి. వధువు కుటుంబీకులు వరుడికి దేహశుద్ధి చేశారు. బీహార్‌లోని గయా జిల్లాలోని ఇక్బాల్‌పూర్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ఇక్బాల్‌పూర్‌కు చెందిన ఓ యువకుడికి అక్కడి దోబీ పోలీస్ స్టేషన్ పరిధిలోని బజౌరా గ్రామానికి చెందిన యువతితో నిశ్చితార్థం జరిగింది.
 
అనంతరం వధూవరులు వేదికపైకి వచ్చారు. వేడుకలో, వరుడు సంప్రదాయబద్ధంగా 'సెహ్రా' అనే తలకవచాన్ని ధరిస్తాడు. అందుకు తగ్గట్టుగానే తలపాగా వేసుకునేందుకు ప్రయత్నించగా.. విగ్గు పెట్టుకుని పెళ్లి విషయాన్ని దాచిపెట్టేందుకు ప్రయత్నించినట్లు తేలింది.
 
దీన్ని చూసిన వధువు కుటుంబ సభ్యులు ఒక్కసారిగా మండిపడ్డారు. ఆవేశంతో ఊగిపోయారు. వరుడిపై దాడి చేశారు. విగ్గు పెట్టి మోసం చేస్తారా అంటూ మండిపడ్డారు. వరుడు తనను క్షమించమని వేడుకున్నాడు. అంతేగాకుండా ఆ వరుడికి ఇదివరకే పెళ్లయిందని, మొదటి పెళ్లిని దాచిపెట్టి రెండో పెళ్లికి సిద్ధమైనట్లు కూడా తేలింది. 
 
దీంతో కోపోద్రిక్తులైన వధువు కుటుంబీకులు అతనిపై దాడికి దిగారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో విడుదలై వైరల్ అవుతోంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రజనీకాంత్ చిత్రంలో విజయ్ సేతుపతి!!

'మన శంకర వరప్రసాద్ గారు' అందర్నీ సర్‌ప్రైజ్ చేస్తారు : అనిల్ రావిపూడి

Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ G.O.A.T సినిమాకి బ్యాగ్రౌండ్ అందిస్తున్న మణిశర్మ

Aadi Pinisetty: బాలయ్య ముక్కు సూటి మనిషి, అల్లు అర్జున్ తో హలో హాయ్ అంతే.. : ఆది పినిశెట్టి

Shobhan Babu: సోగ్గాడు స్వర్ణోత్సవ పోస్టర్ రిలీజ్ చేసిన డి.సురేష్ బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

ఈ అనారోగ్య సమస్యలున్నవారు ఉదయాన్నే గోరువెచ్చని నీటిని తాగరాదు

Ginger Pachhadi: శీతాకాలం.. అల్లం పచ్చడితో ఆరోగ్యానికి ఎంత మేలో తెలుసా?

జుట్టుకు మేలు చేసే ఉల్లిపాయ నూనె.. మసాజ్ చేస్తే అవన్నీ పరార్

శీతాకాలంలో లవంగం దగ్గర పెట్టుకోండి, బాగా పనికొస్తుంది

తర్వాతి కథనం
Show comments