25 వేళ్లతో జన్మించిన శిశువు!! భువనేశ్వరి దేవి అనుగ్రహమంటూ...

వరుణ్
సోమవారం, 22 జులై 2024 (11:46 IST)
కర్నాటక రాష్ట్రంలోని బాగల్‌‍కోట్‌ జిల్లాలో ఓ మహిళ వింత శిశువుకు జన్మనిచ్చింది. ఏకంగా 25 వేళ్ళతో జన్మించింది. చేతికి 12, కాళ్ళకు 13 వేళ్ళు ఉన్నాయి. ఇలా మొత్తం 25 వేళ్లు ఉండటంతో భువనేశ్వరి దేవి అనుగ్రహం వల్లే ఇలా జరిగిందంటూ కుటుంబ సభ్యులు సంబరపడిపోతున్నారు. పైగా, ఆ చిన్నారిని చూసేందుకు స్థానికులు భారీగా తరలివస్తున్నారు. 
 
జిల్లాలోని రబకావి బన్‌‍హట్టి పట్ణంలోని సన్ షైన్ ఆస్పత్రిలో ఈ బిడ్డ పుట్టింది. ఆస్పత్రి ప్రసూతి వైద్యురాలు పార్వతి హిరేమత్ మాట్లాడుతూ, క్రోమోజోముల్లో అసమతుల్యత వల్ల ఒక్కోసారి ఇలా జరుగుతుందని ఇలాంటి ఘటనలు చాలా అరుదని తెలిపారు. తల్లీపిల్లలు ఇద్దరూ క్షేమంగా ఉన్నట్టు పేర్కొన్నారు. చిన్నారికి భారతి అని పేరు పెట్టామని చెప్పారు. 
 
తమ కుమార్తె గురించి తండ్రి గురప్ప స్పందిస్తూ, సంతానం కోసం తన భార్య కుందరిగి శ్రీ భువనేశ్వరి శక్తీపఠం సురగిరి హిల్స్ ఆలయంలో పూజలు చేసిందని, అమ్మవారి అనుగ్రహంతోనే పాప ఇలా జన్మించిందని చెప్పారు. కాగా, గత యేడాది రాజస్థాన్ రాష్ట్రంలో కూడా ఓ చిన్నారి ఏకంగా 26 వేళ్లతో జన్మించిన విషయం తెల్సిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Akhanda 2 date: బాలక్రిష్ణ అఖండ 2 రిలీజ్ డేట్ ను ప్రకటించిన నిర్మాతలు - డిసెంబర్ 12న రిలీజ్

ఆహ్వానించేందుకు వచ్చినపుడు షూటింగ్‌లో డ్యాన్స్ చేస్తున్నా : చిరంజీవి

పవన్ కల్యాణ్‌కు మొండి, పట్టుదల ఎక్కువ.. ఎక్కడా తలొగ్గడు.. జయసుధ (video)

శాంతారామ్ బయోపిక్‌లో తమన్నా.. పోస్టర్ రిలీజ్ చేసిన టీమ్.. లుక్ అదుర్స్

శర్వా... నారి నారి నడుమ మురారి రిలీజ్-ముహూర్తం ఖరారు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

winter health, తులసి పొడిని తేనెలో కలిపి తాగితే...

పది లక్షల మంది పిల్లల్లో ప్రకటనల అక్షరాస్యతను పెంపొందించే లక్ష్యం

తమలపాకులు ఎందుకు వేసుకోవాలి?

సులభంగా శరీర బరువును తగ్గించే మార్గాలు

winter health, శీతాకాలంలో ఉసిరి కాయలు ఎందుకు తినాలి?

తర్వాతి కథనం
Show comments