Webdunia - Bharat's app for daily news and videos

Install App

బ్రహ్మచారి నీకేంటి వీసా ఇచ్చేదన్న వారే ఇపుడు రెడ్‌కార్పెట్ పరిచారు: రాందేవ్ బాబా

ప‌తంజ‌లి పేరుతో ప్రొడ‌క్ట్స్‌ను మార్కెట్‌లోకి దించిన ప్ర‌ముఖ యోగా గురువు బాబా రాందేవ్.. ప్ర‌జ‌ల అభిరుచుల‌కు అనుగుణంగా ఫ‌క్తు వ్యాపారిగా మారిపోయారు. ఇప్ప‌టివ‌ర‌కు ఆయ‌న 800 ర‌కాల ఉత్పత్తులను మార్కెట్‌లో

Webdunia
మంగళవారం, 25 అక్టోబరు 2016 (09:46 IST)
ప‌తంజ‌లి పేరుతో ప్రొడ‌క్ట్స్‌ను మార్కెట్‌లోకి దించిన ప్ర‌ముఖ యోగా గురువు బాబా రాందేవ్.. ప్ర‌జ‌ల అభిరుచుల‌కు అనుగుణంగా ఫ‌క్తు వ్యాపారిగా మారిపోయారు. ఇప్ప‌టివ‌ర‌కు ఆయ‌న 800 ర‌కాల ఉత్పత్తులను మార్కెట్‌లోకి ప్ర‌వేశ‌పెట్టారు. వీటిలో పేస్ట్, కారం పొడులు, మందులు ఇత్యాది స‌రుకుల‌ు ఉన్నాయి. తాజాగా దుస్తుల వ్యాపారంలోకి కూడా ఎంట్రీ ఇవ్వనున్నారు.
 
ప్రస్తుతం ఈయన వ్యాపార మార్కెట్ విలువ రూ.4,500 కోట్లు. అయితే తన జీవితంలో ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న రాందేవ్‌ కూడా వీసా చిక్కులు తప్పలేదట. ఆయనకు విసా ఇచ్చేందుకు నిరాకరించారట. 
 
గతంలో తనకు ఎదురైన ఈ ఘటనని ఇండోర్‌లో జరిగిన గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్‌లో గుర్తుచేసుకున్నారు. ''తొలిసారి నేను అమెరికా వీసా కోసం దరఖాస్తు చేసుకున్నప్పుడు అందుకు అమెరికా అధికారులు నిరాకరించారు. అందుకు కారణం అడిగితే బ్రహ్మచారి కావడం, బ్యాంకు ఖాతా లేకపోవడం వల్ల వీసా ఇవ్వలేమని తేల్చి చెప్పారు. 
 
ఈ రెండూ కాకుండా వేరే కారణం ఏదైనా ఉందా అని అడిగినప్పుడు బాబాజీ… ఇప్పట్లో వీసా ఇవ్వలేమం అని తేల్చిచెప్పారు'' అని అప్పటి విషయాలను గుర్తు చేసుకున్నారు. అయితే ఆ తర్వాత అమెరికానే తనను స్వయంగా ఆహ్వానించి… పదేళ్ల పాటు అమలులో ఉండే వీసా ఇచ్చిందని, కొరకుండానే పదేళ్ల వీసా అందించారని చెప్పుకొచ్చారు రాందేవ్ బాబా. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పెద్ద నటులతో నటించా, ఆత్మహత్య చేసుకునే స్థితిలో వున్నా: పావలా శ్యామల (video)

ది రైజ్ ఆఫ్ అశోక నుంచి సతీష్ నీనాసం ఫస్ట్ లుక్

టెక్నాలజీ కీలకపాత్రతో నూతన చిత్రం షూటింగ్

సంక్రాంతికి వస్తున్నాం అందరూ ఎంజాయ్ చేస్తారు: వెంకటేష్

తెలంగాణలో కల్లు, మటన్: తెలంగాణ కల్చర్‌ను అవమానిస్తానా: దిల్ రాజు (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

దొండ కాయలు గురించి ఆయుర్వేదం ఏం చెబుతోంది?

సంక్రాంతి పండుగకి పోషకాలతో కూడిన కాలిఫోర్నియా బాదం వంటకం

మాంసాహారం కంటే మొలకెత్తిన తృణ ధాన్యాలు ఎంతో మేలు, నిమ్మరసం కలిపి తీసుకుంటే?

అరటి కాండం రసం తాగితే ఏమవుతుంది?

ఎముకలు దృఢంగా వుండాలంటే వేటిని తినాలి?

తర్వాతి కథనం
Show comments