Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏటీఎంలలో సాఫ్ట్‌వేర్ అప్‌డేట్‌కు 45 రోజులు పడుతుంది.. అప్పటివరకు చిల్లర కష్టాలే...

దేశంలో పెద్ద నోట్ల రద్దుతో చిల్లర కష్టాలు ఇప్పట్లో తీరేలా లేవు. దేశ వ్యాప్తంగా చిల్లర డిమాండ్ నెలకొడంతో పాటు.. ఏటీఎం కేంద్రాలు పని చేయడం లేదు. దీంతో ఈ కష్టాలు ఇప్పట్లో తీరేలా లేవని వారు చెపుతున్నారు.

Webdunia
బుధవారం, 16 నవంబరు 2016 (15:46 IST)
దేశంలో పెద్ద నోట్ల రద్దుతో చిల్లర కష్టాలు ఇప్పట్లో తీరేలా లేవు. దేశ వ్యాప్తంగా చిల్లర డిమాండ్ నెలకొడంతో పాటు.. ఏటీఎం కేంద్రాలు పని చేయడం లేదు. దీంతో ఈ కష్టాలు ఇప్పట్లో తీరేలా లేవని వారు చెపుతున్నారు.
 
అదే అంశంపై ఎన్.సీ.ఆర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ఎండీ నవ్‌రోజ్ దత్తా మాట్లాడుతూ దేశవ్యాప్తంగా ఉన్న 2 లక్షలకు పైగా ఏటీఎంలను ఒక్కోదాన్నీ కొత్త నోట్లు సైతం వచ్చేలాగా రీ కాలిబ్రేట్‌ చేయడానికి 45 రోజులు పడుతుందన్నారు.
 
రీకాలిబ్రేషన్‌ గురించి, అందుకు అంత ఎక్కువ సమయం ఎందుకు పడుతుందనే విషయాన్ని వివరంగా వివరించారు. కొత్త నోట్లతో పోలిస్తే పాత నోట్లు పరిమాణంలో పెద్దవి. కొత్త నోట్లకు అనుగుణంగా ఏటీఎంలలో కరెన్సీ కాసెట్లను అమర్చడమే రీకాలిబ్రేషన్‌ అంటారని ఆయన వివరించారు. 
 
అలాగే కొత్తగా రూ.2 వేల నోట్లు వచ్చినందున సాఫ్ట్‌వేర్‌లో కూడా మార్పులు చేయాల్సి ఉందన్నారు. దేశంలోని ప్రతి ఏటీఎంలోనూ ఇలా చేయాల్సి ఉన్నందున.. మొత్తం అన్ని ఏటీఎంలూ రీకాలిబ్రేట్‌ అయి పూర్తిస్థాయిలో అందుబాటులోకి రావడానికి 45 రోజులు పడుతుందని ఆయన చెప్పుకొచ్చారు.

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments