Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏటీఎంలకు డబ్బు నింపే వ్యాన్‌తో ఉడాయించిన డ్రైవర్.. భార్య వద్ద రూ.79.80లక్షల స్వాధీనం..

నోట్ల రద్దుతో ఏటీఎంల వద్ద గంటల పాటు ప్రజలు గడపాల్సిన పరిస్థితి ఏర్పడిన సంగతి తెలిసిందే. కొత్త కరెన్సీ కోసం బ్యాంకులు, ఎటిఎం ల వద్ద ప్రజలు బారులు తీరుతున్నారు. ప్రజల బాధలను తీర్చేందుకు ఎటిఎంలను మరింత వ

Webdunia
సోమవారం, 28 నవంబరు 2016 (12:04 IST)
నోట్ల రద్దుతో ఏటీఎంల వద్ద గంటల పాటు ప్రజలు గడపాల్సిన పరిస్థితి ఏర్పడిన సంగతి తెలిసిందే. కొత్త కరెన్సీ కోసం బ్యాంకులు, ఎటిఎం ల వద్ద ప్రజలు బారులు తీరుతున్నారు. ప్రజల బాధలను తీర్చేందుకు ఎటిఎంలను మరింత వినియోగంలోకి తెచ్చేందుకు బ్యాంకులు ప్రయత్నిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఏటీఎంలకు డబ్బులను తీసుకెళ్ళే వ్యాన్ డ్రైవర్ 1.37 కోట్ల సొమ్ముతో సహ ఉడాయించాడు.  
 
కొత్త కరెన్సీ నోట్ల ప్రజలు ఎదురుచూస్తోంటే ఏకంగా కోటి37 లక్షల నగదు ఉన్న వ్యాన్ తో డ్రైవర్ పారిపోవడం చర్చనీయాంశమైంది. బెంగళూరులో రూ. 1.37 కోట్ల కొత్త కరెన్సీతో పారిపోయిన క్యాష్ వ్యాన్ డ్రైవర్ కేసులో పోలీసులు పురోగతిని సాధించారు. ఏటీఎంలలో నగదు నింపే పని చూస్తున్న వారిలో వాహనం డ్రైవర్, దాన్ని తీసుకుని ఈ నెల 23 పారిపోయిన సంగతి తెలిసిందే.
 
ఈ కేసులో వ్యాన్ డ్రైవర్ బార్య పోలీసులకు పట్టుబడగా, ఆమె నుంచి రూ. 79.80 లక్షలను రికవర్ చేశారు. లాజి క్యాష్ అనే సంస్థలో పనిచేస్తున్న నిందితుడు, మరో ఇద్దరు ఉద్యోగులు, సెక్యూరిటీతో కలసి ఏటీఎంల్లో డబ్బు నింపేందుకు వెళ్లిన వేళ, ఇతర ఉద్యోగులు ఏటీఎంలోకి వెళ్లగా, వాహనాన్ని తీసుకుని నిందితుడు పారిపోయాడు. కంపెనీ ఫిర్యాదు మేరకు పోలీసులు విచారణ ప్రారంభించి ఆయన భార్యను అరెస్ట్ చేశారు. మిగతా డబ్బును కూడా రికవరీ చేస్తామని పోలీసు వర్గాలు వెల్లడించాయి.

పవన్ కల్యాణ్‌పై షాకింగ్ కామెంట్స్ చేసిన రేణు దేశాయ్

మ్యూజిక్ షాప్ మూర్తి నుంచి రాహుల్ సిప్లిగంజ్ పాడిన అంగ్రేజీ బీట్ లిరికల్ వచ్చేసింది

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆహ్వానించిన దర్శకుల సంఘం

రోడ్డు ప్రమాదంలో పవిత్ర మృతి.. త్రినయని నటుడు చంద్రకాంత్ ఆత్మహత్య

రాహుల్ విజయ్, శివాని ల విద్య వాసుల అహం ఎలా ఉందంటే.. రివ్యూ

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments