Webdunia - Bharat's app for daily news and videos

Install App

48 గంటల్లో 42 మంది చిన్నారుల మృతి... గోరఖ్‌పూర్‌లో దారుణం

ఉత్తరప్రదేశ్ రాష్ట్రం, గోరఖ్‌పూర్‌లోని బీఆర్డీ ఆస్పత్రిలో చిన్నారుల మరణమృదంగ ఘోష ఇప్పట్లో ఆగేలా కనిపించడం లేదు. గడచిన 48 గంటల్లో 42 మంది చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. ఈ చిన్నారుల మృతిపై బీఆర్డీ మెడి

Webdunia
బుధవారం, 30 ఆగస్టు 2017 (12:37 IST)
ఉత్తరప్రదేశ్ రాష్ట్రం, గోరఖ్‌పూర్‌లోని బీఆర్డీ ఆస్పత్రిలో చిన్నారుల మరణమృదంగ ఘోష ఇప్పట్లో ఆగేలా కనిపించడం లేదు. గడచిన 48 గంటల్లో 42 మంది చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. ఈ చిన్నారుల మృతిపై బీఆర్డీ మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ పీకే సింగ్ స్పందించారు. 42 మంది చిన్నారుల్లో.. ఏడుగురు మెదడువాపు వ్యాధితో, మరో 35 మంది చిన్నారులు ఇతర కారణాలతో మృతి చెందినట్లు ఆయన వెల్లడించారు.
 
ఆగస్టు 27వ తేదీన చిన్నపిల్లల విభాగంలో 342 మంది చిన్నారులు చికిత్స కోసం చేరారు. అందులో 17 మంది మృతి చెందారు. ఆగస్టు 28న 344 మంది చిన్నారులు చికిత్స పొందుతుండగా 25 మంది చిన్నారులు మృతి చెందినట్లు పీకే సింగ్ తెలిపారు. ఆగస్టు 7 నుంచి 11వ తేదీ మధ్యలో ఆక్సిజన్ అందక 60 మంది చిన్నారులు మృతి చెందిన విషయం విదితమే. 
 
కాగా, చిన్నారుల మృతి కేసుకు సంబంధించి.. బీఆర్డీ మెడికల్ కాలేజీ మాజీ ప్రిన్సిపాల్ డాక్టర్ రాజీవ్ మిశ్రా, ఆయన భార్య పూర్ణిమ శుక్లాను పోలీసులు కాన్పూర్‌లో అరెస్టు చేసిన విషయం తెలిసిందే. 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'గేమ్ ఛేంజర్' నుంచి మరో లిరికల్ సాంగ్.. ఎలావుందంటే?(Video)

నాకోసం పోలీసులు వెతుకుతున్నారా? 26 పాయింట్లతో రాంగోపాల్ వర్మ భారీ ట్వీట్

మాలీవుడ్ ప్రేక్షకులకు ఇచ్చే అతిపెద్ద బహుమతి ఇదే : అల్లు అర్జున్

కోర్టు డ్రామా నేపథ్యంగా సాగే ఉద్వేగం మూవీ రివ్యూ

సమంత "రాణి"గా అభివర్ణించిన శ్రీలీల.. ఎందుకో తెలుసా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లవంగం పాలు ఆరోగ్య ప్రయోజనాలు

చియా విత్తనాలు అద్భుత ప్రయోజనాలు

Winter Fruit కమలా పండ్లును తింటే ప్రయోజనాలు

ఎర్ర జామ పండు 7 ప్రయోజనాలు

ఉసిరికాయలను తేనెలో ఊరబెట్టి తింటే?

తర్వాతి కథనం
Show comments