Webdunia - Bharat's app for daily news and videos

Install App

"అమ్మ" బెయిల్ కోసం యాగాలు కాదు... త్యాగాలు చేయండి: జ్యోతిష్కుల సూచన

"అమ్మ" బెయిల్ కోసం యాగాలు కాదు... త్యాగాలు చేయండి: జ్యోతిష్కుల సూచన

Webdunia
బుధవారం, 15 అక్టోబరు 2014 (15:31 IST)
అక్రమాస్తుల కేసులో జయలలిత జైలు పాలైనప్పటి నుంచి అన్నాడీఎంకే శ్రేణులు ఆలయాల్లో ప్రత్యేక పూజలు, హోమాలు, యాగాలు నిర్వహిస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రముఖ జ్యోతిష్యులు షెల్వి మాట్లాడుతూ ప్రస్తుతం జయ జాతకంలో గురుస్థానం బలహీనంగా ఉందని, ఆ కారణంగానే ఆమె పదవులు కోల్పోయి, జైలు పాలయ్యారన్నారు. 
 
జయ విడుదల కావాలంటే, అన్నాడీఎంకే శ్రేణులు యాగాలు చేయడం మానేసి త్యాగాలు చేయాలన్నారు. అంటే పార్టీ కార్యకర్తల దగ్గర నుంచి మంత్రుల వరకు అంతా శుచీశుభ్రతను పాటిస్తూ, మాంసాహారానికి దూరంగా ఉండాలని వివరించారు.
 
మరో జ్యోతిష్కుడు విద్యాధరన్ మాట్లాడుతూ జయ జాతకం ప్రకారం ఆమెకు కష్టకాలం తప్పదన్నారు. గ్రహ బలం చెడిన
కారణంగానే గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్నారని, ఈ నెల 21వ తేది నుంచి ఆమెకు మంచి జరుగుతుందని చెప్పారు.

కనుక అన్నాడీఎంకే శ్రేణులు గోదానం, రక్తదానం, అవయవదానం వంటి చేయాలని, శుచి శుభ్రతలు పాటించాలని సూచించారు. మొత్తానికి అన్నాడీఎంకే శ్రేణులు యాగాలకంటే త్యాగాలు చేస్తేనే ఆమెకు మంచి జరుగుతుందని స్పష్టం చేశారు.

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

Show comments