దేశంలోని పలు వ్యభిచార గృహాల్లో అస్సాం అమ్మాయిలు హాట్‌కేకుల్లా అమ్ముడు పోతున్నాయి. దేశ రాజధాని నగరమైన ఢిల్లీలోని రెడ్‌లైట్ ప్రాంతంలో పోలీసులు జరిపిన ఆకస్మిక తనిఖీల్లో అస్సాంకు చెందిన ఓ అమ్మాయి పట్టుబడి
దేశంలోని పలు వ్యభిచార గృహాల్లో అస్సాం అమ్మాయిలు హాట్‌కేకుల్లా అమ్ముడు పోతున్నాయి. దేశ రాజధాని నగరమైన ఢిల్లీలోని రెడ్‌లైట్ ప్రాంతంలో పోలీసులు జరిపిన ఆకస్మిక తనిఖీల్లో అస్సాంకు చెందిన ఓ అమ్మాయి పట్టుబడింది. ఆమె వెల్లడించిన వివరాలతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఆ అమ్మాయిని సాక్షాత్ అమ్మమ్మే ఢిల్లీకి తీసుకువచ్చి వ్యభిచార ముఠాకు విక్రయించిందనే చేదు వాస్తవం పోలీసుల దర్యాప్తులో తేలింది.
అస్సాం రాష్ట్రంలోని కొక్రాఝర్ జిల్లాకు మరో అమ్మాయిని నేపాల్‌కు తీసుకువెళ్లి అక్కడి నుంచి తప్పుడు పత్రాలతో సౌదీ అరేబియాకు తరలించారని తేలింది. సౌదీలో 8 యేళ్ల పాటు వ్యభిచారం సాగించిన ఆ అమ్మాయిని రక్షించి 2013లో స్వస్థలానికి తరలించారు.
ఇలా ఢిల్లీ, సౌదీలోనే కాదు ముంబై, కోల్‌కతా, అహ్మదాబాద్, చెన్నైతోపాటు పలు నగరాల్లోనే కాదు విదేశాల్లోనూ అసోం అమ్మాయిలను అక్రమంగా రవాణా చేసి వారిని వ్యభిచార వృత్తిలోదించారనే వాస్తవాలు తాజా అధ్యయనాల్లో వెల్లడైంది.
దీనిపై నేదాన్ ఫౌండేషన్ అధ్యక్షురాలు దిగంబర్ నార్జరీ స్పందిస్తూ అస్సోంలోని 8 జిల్లాల్లో ప్రతిరోజూ నలుగైదుగురు బాలికలు అదృశ్యమవుతున్నారని చెప్పుకొచ్చారు. పేదరికం, నిరక్షరాస్యత వల్ల గిరిజన కుటుంబాలకు చెందిన అమ్మాయిలు వ్యభిచార రొంపిలో దిగుతున్నారని నార్జరీ వివరించారు. అసోంలో వరదలు, తీవ్రవాదం, పేదరికం, నిరుద్యోగ సమస్యల వల్ల కూడా అసోం అమ్మాయిలు వ్యభిచార రాకెట్‌లో చిక్కుకుంటున్నారని తేల్చారు.
మరోవైపు.. జాతీయ నేర గణాంక సంస్థ (ఎన్.సి.ఆర్.బి) విడుదల చేసిన నివేదికలో అస్సోం అమ్మాయిల అక్రమ రవాణాకు కేంద్రంగా మారిందని పేర్కొంది. అస్సోంలో నమోదైన 1494 కేసుల్లో 22 శాతం అమ్మాయిల అక్రమ రవాణా కేసులని తేలింది. దేశంలోనే అత్యధికంగా 38 శాతం అంటే 1,317 బాలికల అక్రమ రవాణా కేసులు అస్సోంలోనే నమోదవడంపై మహిళా సంఘాలు ఆందోళన వ్యక్తం చేశాయి.