అస్సాంలో బహు భార్యత్వంపై నిషేధం... అతిక్రమిస్తే పదేళ్ల జైలు

ఠాగూర్
శుక్రవారం, 28 నవంబరు 2025 (11:52 IST)
అస్సాం రాష్ట్రంలోని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం పలు కఠిన చట్టాలను అమలు చేస్తోంది. ఇందులోభాగంగా, బహుభార్యత్వంపై నిషేధం విధించింది. ఈ చట్టాన్నిఉల్లంఘించేవారికి పదేళ్ళ జైలుశిక్షను విధించనున్నట్టు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి హేమంత్ బిస్వశర్మ వెల్లడించారు. ఈ మేరకు ఆ రాష్ట్ర అసెంబ్లీలో ఓ బిల్లును ప్రవేశపెట్టి ఆమోదించారు. 
 
ఈ బిల్లులో పేర్కొన్న అంశాల మేరకు.. ఇకపై పురుషులు ఒకరి కంటే ఎక్కువ మంది వివాహం చేసుకోవడం రాష్ట్రంలో నేరంగా పరిగణించబడుతుంది. ఈ నిబంధన ఉల్లంఘించిన వారికి గరిష్టంగా పదేళ్ళ వరకు కఠిన కారాగారశిక్షను విధించేలా ఆ చట్టంలో నిబంధనను పొందుపరిచారు.
 
ఈ చట్టంపై ముఖ్యమంత్రి హేమంత్ బిస్వశర్మ మాట్లాడుతూ, బహుభారత్వ నిషేధ చట్టం ఇస్లాం మతానికి వ్యతిరేకంగా తెచ్చింది కాదన్నారు. ఇది అన్ని మతవర్గాలకూ సమానంగా వర్తిస్తుందని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్రంలో మహిళల హక్కులను పరిరక్షించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆయన వెల్లడించారు. 
 
అయితే, ఈ చట్టానికి ప్రభుత్వం కొన్ని మినహాయింపులు కూడా కల్పించింది. రాజ్యాంగంలోని ఆరో షెడ్యూల్ పరిధిలోన  ప్రాంతాల్లో నివసిస్తున్న షెడ్యూల్ తెగల వారికి ఈ చట్టం వర్తించదని ప్రభుత్వం స్పష్టం చేసింది. సామాజిక సంస్కరణ దిశగా ఈ చట్టాన్ని ఒక ముఖ్యమైన అడుగుగా అస్సాం ప్రభుత్వం భావిస్తోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కూలీ ఫట్.. టాలీవుడ్ టాప్ హీరోలు వెనక్కి.. పవన్ మాత్రం లోకేష్‌తో సినిమా చేస్తారా?

వేధింపులు ధైర్యంగా ఎదుర్కోండి.. మహిళలకు ఐష్ పిలుపు

ఇకపై చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్‌కు విదేశీ విరాళాలు

Naveen Polishetty : భీమవరం బల్మా గీతంతో గాయకుడిగా అదరగొట్టిన నవీన్‌ పొలిశెట్టి

Manoj: కంటెంట్ బాగుంటే ప్రేక్షకులు ఆదరిస్తున్నారు : మంచు మనోజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కాలిఫోర్నియా బాదంతో రెండు సూపర్‌ఫుడ్ రెసిపీలతో శీతాకాలపు ఆరోగ్యం ప్రారంభం

సీతాఫలం పండును ఎవరు తినకూడదు... తింటే విషం తీసుకున్నట్టే?

డయాబెటిస్ వున్నవారు తెలుసుకోవాల్సిన విషయాలు

Mint For Weight Loss: మహిళలు ఈజీగా బరువు తగ్గాలంటే.. పుదీనాను ఇలా వాడాలట..

భారతదేశంలో ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ బాధిత రోగులలో జీవించే అవకాశాలు కేవలం 3 శాతం మాత్రమే.. కానీ...

తర్వాతి కథనం
Show comments