Webdunia - Bharat's app for daily news and videos

Install App

పాకిస్థాన్ డ్రగ్స్ మాఫియా.. గుజరాత్‌లోని మోర్బీలో భారీ స్థాయిలో డ్రగ్స్

Webdunia
సోమవారం, 15 నవంబరు 2021 (12:11 IST)
పాకిస్థాన్ డ్రగ్స్ మాఫియాను పోలీసులు గుర్తించారు. గుజరాత్‌లోని మోర్బీ జిల్లాలో భారీస్థాయిలో డ్రగ్స్‌ పట్టుకున్నారు ఏటీఎస్ అధికారులు. మలియా మియానా నుంచి 120 కిలోల డ్రగ్స్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ డ్రగ్స్ మార్కెట్ ధర రూ.600 కోట్ల వరకు ఉంటుందని అంచనా వేస్తున్నారు. డ్రగ్స్ ముఠాకు చెందిన నలుగురుని కూడా అరెస్ట్ చేసి దర్యాప్తు చేపట్టారు పోలీసులు.
 
ఇది ఖలీద్ బక్ష్‌కు సంబంధించిన డ్రగ్స్‌గా గుర్తించారు పోలీసులు. ఈ డ్రగ్స్ పాకిస్థాన్ నుండే భారత్‌కు వచ్చినట్లుగా తెలుస్తుంది. ఈ కేసులో బయటకు వస్తున్న ఖలీద్ అనే వ్యక్తికి నేరుగా ఉగ్రవాద సంస్థ జైషే మహ్మద్‌తో పరిచయం ఉన్నట్లుగా తెలుస్తుంది. భారత్‌కు పంపిన ఈ డ్రగ్స్‌కు సంబంధించిన స్క్రిప్ట్‌ను దుబాయ్‌లో రచించినట్లు సమాచారం.
 
దుబాయ్‌లోని సోమాలియా క్యాంటీన్‌లో పాకిస్థాన్ మాఫియా ఖలీద్ ఇద్దరు భారతీయ స్మగ్లర్లు జబ్బార్, గులామ్‌లను కలిశాడు. పోలీసులు ఇద్దరినీ అరెస్ట్ చేసినట్లు తెలుస్తుంది. పాకిస్థానీ డ్రగ్స్ మాఫియా ఖలీద్ భారత్‌కు భారీ ఎత్తున డ్రగ్స్ సరఫరా చేసేందుకు ఇంతకుముందు కూడా అనేకసార్లు ప్రయత్నించాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విజయ్ దేవరకొండ రౌడీ వేర్ బ్రాండ్ కు ఔట్ లుక్ ఇండియా బిజినెస్ అవార్డ్

వికటకవి చూసి గర్వంగా అనిపించింది.. నిర్మాత రామ్ తాళ్లూరి

రామ్ పోతినేని సినిమాకు తమిళ సంగీత ద్వయం వివేక్ - మెర్విన్

ఉజ్జయిని మహాకాళేశ్వర్ టెంపుల్ సాక్షిగా కన్నప్ప రిలీజ్ డేట్ ప్రకటన

వెన్నెల కిషోర్ నటించిన శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్ రిలీజ్ డేట్ ఫిక్స్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బార్లీ వాటర్ ఎందుకు తాగాలి? ప్రయోజనాలు ఏమిటి?

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

బాదంపప్పులను తింటుంటే వ్యాయామం తర్వాత త్వరగా కోలుకోవడం సాధ్యపడుతుందంటున్న పరిశోధనలు

సింక్రోనస్ ప్రైమరీ డ్యూయల్ క్యాన్సర్‌లకు అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విజయవంతమైన చికిత్స

ఎండుద్రాక్షలు ఎందుకు తినాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments