Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఢిల్లీ లిక్కర్ స్కామ్ : ఈడీ విచారణకు మళ్లీ డుమ్మాకొట్టిన సీఎం కేజ్రీవాల్

Webdunia
శుక్రవారం, 22 డిశెంబరు 2023 (12:11 IST)
ఢిల్లీ లిక్కర్ స్కామ్ విచారణకు ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ మరోమారు గైర్హాజరయ్యారు. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ పంపిన నోటీసులను ఆయన ఏమాత్రం పట్టించుకోలేదు. ఈ నోటీసులు రాజకీయ ప్రేరేపితమైనవని, అక్రమమని, ఈడీకి ఆయన ఘాటుగా బదులిచ్చారు. ఈ నోటీసులు వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. తాను నీతి నిజాయితీలతో జీవిస్తున్నానని ఆయన చెప్పుకొచ్చారు. 
 
ఈ కేసుకు సంబంధించి గతంలోనూ ఆయనకు ఈడీ నోటీసులు జారీచేసిన విషయం తెల్సిందే. నవంబరు 2వ తేదీన విచారణకు రావాలని కోరగా, మధ్యప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల ప్రచారంలో పాల్గొనాల్సివుందని, ఎన్నికల ప్రచారం చేయకుండా అడ్డుకోవడానికే ఈ నోటీసులు కేంద్రం పంపింపిందని కేజ్రీవాల్ ఆరోపించారు. దీంతో ఆయన ఆ విచారణకు వెళ్లలేదు. దీంతో నోటీసులను వెనక్కి తీసుకున్న ఈడీ.. తాజాగా ఈ నెల 21వ తేదీన విచారణకు హాజరుకావాలంటూ మరోమారు నోటీసులు జారీచేసింది. 
 
అయితే, ఈసారి కూడా డుమ్మా కొట్టారు. కాగా, ప్రస్తుతం ఆయన పంజాబ్ రాష్ట్రంలోని ఓ మారుమూల గ్రామంలో విపాసన ధ్యాన కోర్సు చేస్తున్నారు. దీంతో ఆయన మరో వారం రోజుల పాటు రాజకీయాలకు దూరంగా ఉంటారని పార్టీ వర్గాలు తెలిపాయి. 
 
కాగా, ముందుగా నిర్ణయించిన ప్రకారం ఈ కోర్సుకు హాజరయ్యేందుకు కేజ్రీవాల్ మంగళవారమే బయలుదేరి వెళ్లాల్సివుంది. అయితే, ఇండియా కూటమి ఉండటంతో కేజ్రీవాల్ తన కార్యక్రమాలను వాయిదా వేసుకున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'గేమ్ ఛేంజర్‌'లో మంచి సందేశం ఉంది : నిర్మాత దిల్ రాజు

ల‌క్నోలో 9న గేమ్ చేంజర్ టీజర్, తమిళ సినిమాలూ నిర్మిస్తా : దిల్ రాజు

సంగీత దర్శకుడు కోటి అభినందనలు అందుకున్న తల్లి మనసు

యూత్‌ఫుల్‌ రొమాంటిక్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రోటి కపడా రొమాన్స్‌

తెలుగు ప్రజలను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు వెనక్కి తీసుకుంటున్నా : నటి కస్తూరి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కండలు పెంచాలంటే ఇవి తినాలి, ఏంటవి?

టీ అతిగా తాగితే ఏమవుతుంది?

అవకాడో పండు ఎందుకు తినాలి?

శీతాకాలంలో తినవలసిన ఆహారం ఏమిటి?

వెల్లుల్లి చట్నీ ఎందుకు తినాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments