Webdunia - Bharat's app for daily news and videos

Install App

కేజ్రీవాల్‌కు జ్యూడిషియల్ రిమాండ్... తీహార్ జైలుకు తరలింపు!!

ఠాగూర్
సోమవారం, 1 ఏప్రియల్ 2024 (13:58 IST)
ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు అరెస్టు చేసిన ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు ఢిల్లీ కోర్టు ఈ నెల 15వ తేదీ వరకు జ్యూడిషియల్ రిమాండ్ విధించింది. దీంతో ఆయనను తీహార్ జైలుకు తరలించారు. ఆయన వద్ద విచారణ నిమిత్తం ఈడీకి ఇచ్చిన కస్టడీ సోమవారంతో ముగిసింది. దీంతో ఆయనను ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టులో ఈడీ అధికారులు హాజరుపరిచారు. ఆ తర్వాత ఆయనకు ఈ నెల 15వ తేదీ వరకు జ్యుడిషియల్ రిమాండ్ విధిస్తూ కోర్టు ఆదేశించింది. మరోవైపు, బెయిల్ కోసం ఢిల్లీ హైకోర్టులో ఆయన తరపు న్యాయవాదులు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. మరోవైపు, దేశ చరిత్రలో ఒక ముఖ్యమంత్రి తీహార్ జైలుకు వెళ్లడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. 
 
కాగా, ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో అరవింద్ కేజ్రీవాల్ ప్రధాన నిందితుడిగా ఉన్న విషయం తెల్సిందే. ఈ క్రమంలో విచారణ కోసం రావాలంటూ ఆయనకు ఈడీ ఏకంగా తొమ్మిదిసార్లు సమన్లు జారీచేసింది. ఈ కేసులో ఊరట కోసం ఆయన చేసిన న్యాయపోరాటం ఫలించలేదు. దీంతో మార్చి 22వ తేదీన కేజ్రీవాల్‌ నివాసానికి తనిఖీల పేరుతో వెళ్లిన ఆయనను ఈడీ అధికారులు అరెస్టు చేశారు. ఆ తర్వాత తమ లాకప్‌కు తరలించింది. తద్వారా సీఎం పదవిలో ఉండగా అరెస్టు అయిన తొలి వ్యక్తిగా కేజ్రీవాల్ రికార్డుల్లోకి ఎక్కారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

డాకు మహారాజ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ముఖ్యఅతిథి ఎవరో తెలుసా?

ఓడిపోతే పర్లేదు.. సంకల్పాన్ని గట్టిగా పట్టుకోండి.. సమంత

మోహన్ లాల్, మమ్ముట్టి కాంబినేషన్ లో శ్రీలంకలో షూటింగ్ ప్రారంభం

రామ్ చరణ్, బాలయ్య సినిమాలతోపాటు మేమూ సంక్రాంతికి వస్తున్నాం : వెంకటేష్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రక్తవృద్ధికి తోడ్పడే ఖర్జూరాలు

శీతాకాలంలో ఆరోగ్యంగా వుండటానికి 8 చిట్కాలు

గోరువెచ్చని నిమ్మరసంలో ఉప్పు కలిపి తాగితే 9 ప్రయోజనాలు

అనుకోకుండా బరువు పెరగడానికి 8 కారణాలు, ఏంటవి?

ఉడికించిన వేరుశనగ పప్పు తింటే ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments