Webdunia - Bharat's app for daily news and videos

Install App

చిన్నమ్మ నుంచి పన్నీర్ క్యాంపుకు పాండ్యరాజన్ జంప్.. అరుణ్ జైట్లీ హస్తముందా?

అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి శశికళ శిబిరంలో ఉన్న విద్యాశాఖ మంత్రి పాండ్యరాజన్.. పన్నీర్ సెల్వం క్యాంపులో చేరేందుకు కారణం ఎవరనేదానిపై ఆరా తీస్తే అసలు విషయాలు బయటపడుతున్నాయి. ఎంపీలంతా పన్నీర్ వెంట చేరు

Webdunia
సోమవారం, 13 ఫిబ్రవరి 2017 (09:05 IST)
అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి శశికళ శిబిరంలో ఉన్న విద్యాశాఖ మంత్రి పాండ్యరాజన్.. పన్నీర్ సెల్వం క్యాంపులో చేరేందుకు కారణం ఎవరనేదానిపై ఆరా తీస్తే అసలు విషయాలు బయటపడుతున్నాయి. ఎంపీలంతా పన్నీర్ వెంట చేరుతున్నారంటే... వారి వెంట ఎవరున్నారో అర్థం చేసుకోవచ్చునని కేంద్రాన్ని పరోక్షంగా ఎండగట్టిన శశికళ వ్యాఖ్యలు నిజమేనని రాజకీయ పండితులు అంటున్నారు. 
 
కాగా శశికళ శిబిరంలో కీలకంగా వ్యవహరిస్తూ వచ్చిన పాండ్యరాజన్ ఉన్నట్టుండి పన్నీర్ క్యాంపులో చేరడం వెనుక కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ హస్తం ఉందని వార్తలు వస్తున్నాయి. బడా వ్యాపారవేత్త అయిన పాండ్యరాజన్‌కు సుదీర్ఘకాలంగా కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీతో సత్సంబంధాలున్నాయి. రెండేళ్ల క్రితం డీఎండీకే పార్టీ నుంచి విడివడి అన్నాడీఎంకేలో చేరిన పాండ్యరాజన్‌కు జయ మంచి ప్రాధాన్యత ఇచ్చారు. ఆయనకు ఎమ్మెల్యే సీటు ఇవ్వడంతోపాటు మంత్రి పదవీ కట్టబెట్టారు. ఇందుకు శశికళ కూడా సహకరించారు. అందుకే ఆయన ఆది నుంచి శశికళ పక్షానే నిలిచారు. 
 
పన్నీర్‌ సెల్వంను కూడా ఆయన విమర్శించారు. పార్టీని నిలబెట్టుకొనేందుకు శశికళకు అండగా నిలబడకుండా ఇలా రోడ్డెక్కడం సరికాదంటూ పన్నీర్‌కు హితోక్తులు చెప్పారు. అయితే ఉన్నట్టుండి పన్నీర్ క్యాంపులో చేరిపోవడం వెనక జైట్లీ హస్తం ఉందని.. తమిళనాడు రాజకీయాల్లో కేంద్రం పక్కాగా చక్రం తిప్పుతుందని రాజకీయ పండితులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. 

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments