Webdunia - Bharat's app for daily news and videos

Install App

పాకిస్థాన్‌కు ఎలా బుద్ధి చెపుదాం? మీరే చెప్పండి.. త్రివిధ దళాధిపతులతో మోడీ కీలక భేటీ

పాకిస్థాన్ అనుసరిస్తున్న ద్వంద్వ వైఖరిపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గుర్రుగా ఉన్నారు. ముఖ్యంగా, జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలోని యూరీలోని ఆర్మీ క్యాంపుపై ముష్కర మూకలతో దాడి చేయించిన పాకిస్థాన్‌కు తగిన గుణపాఠ

Webdunia
శనివారం, 24 సెప్టెంబరు 2016 (14:40 IST)
పాకిస్థాన్ అనుసరిస్తున్న ద్వంద్వ వైఖరిపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గుర్రుగా ఉన్నారు. ముఖ్యంగా, జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలోని యూరీలోని ఆర్మీ క్యాంపుపై ముష్కర మూకలతో దాడి చేయించిన పాకిస్థాన్‌కు తగిన గుణపాఠం చెప్పేలా ఆయన వ్యూహ రచన చేస్తున్నారు. ఇందులోభాగంగా శనివారం త్రివిధ దళాధిపతులతో అత్యంత కీలక సమావేశం నిర్వహించారు. 
 
ఈ భేటీలో ఆర్మీ చీఫ్ జనరల్ దల్బీర్ సింగ్, ఎయిర్ చీఫ్‌ మార్షల్ అరూప్ రాహ, నౌకదళం ఉప అధిపతి వైస్ అడ్మిరల్ కేబీ సింగ్‌లతో ప్రత్యేకంగా సమావేశమై, వారందరి సలహాలనూ అడిగి తీసుకున్నారు. పాకిస్థాన్‌కు బుద్ధి ఎలా చెప్పాలో మీరే చెప్పండి అంటూ మోడీ అడిగినట్టు తెలుస్తోంది. 
 
కాగా, ఈ సమావేశానికి జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ధోవల్ కూడా హాజరయ్యారు. సైనిక స్థావరంపై ఉగ్రదాడి తర్వాత ప్రధాని పలుమార్లు ఉన్నతాధికారులతో, కేంద్రమంత్రులతో వార్ రూమ్ సమావేశాలు జరుపుతున్న విషయం తెల్సిందే. కాగా, నౌకాదళం చీఫ్ సునీల్ లాంబా అందుబాటులో లేకపోయినందున కేబీ సింగ్ ఈ సమావేశానికి వచ్చారని అధికారులు తెలిపారు. 

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments