Webdunia - Bharat's app for daily news and videos

Install App

మా ఖాతాల్లోంచి డబ్బు లాగేస్తారా: ముందుగా మేమే లాగేస్తాం: ఖాతాదారుల ప్రతీకారంతో బ్యాంకులు డమాల్

నగదు ఉపసంహరణపై బ్యాంకులు భారీగా చార్జీల వసూళ్లకు తెరలేపాయి. మార్చి1 నుంచి నాలుగు లావాదేవీల తర్వాత ప్రతి లావాదేవీపై అదనపు చార్జీల పేరిట రూ.150 వరకు చెల్లించాల్సి వస్తుందని ప్రకటించాయి. ఈ అదనపు వసూళ్ల న

Webdunia
శనివారం, 4 మార్చి 2017 (04:27 IST)
గతేడాది నవంబర్‌లో కేంద్రం తీసుకున్న పెద్ద నోట్ల రద్దు నిర్ణయం తర్వాత రోజుల కంటే ఇప్పుడే నగదు సమస్య తీవ్రంగా ఉందని బ్యాంకర్లు ప్రైవేట్‌ సంభాషణల్లో చెబుతున్నారు. రద్దు చేసిన నోట్ల స్థానంలో 80 శాతం కొత్త కరెన్సీ వచ్చినా.. అది తిరిగి బ్యాంకులకు రాకపోవడం, ఆర్‌బీఐ నుంచి నగదు అందకపోవడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయని బ్యాంకర్లు చెపుతున్నారు. నాలుగు అతి పెద్ద ప్రభుత్వ రంగ సంస్థల బ్యాంక్‌ బ్రాంచీలను సందర్శించిన మీడియా ప్రతినిధులకు అన్నిచోట్ల నగదు కొరత ఉన్నట్లు స్పష్టంగా కనిపించింది.
 
నగదు ఉపసంహరణపై బ్యాంకులు భారీగా చార్జీల వసూళ్లకు తెరలేపాయి. మార్చి1 నుంచి నాలుగు లావాదేవీల తర్వాత ప్రతి లావాదేవీపై అదనపు చార్జీల పేరిట రూ.150 వరకు చెల్లించాల్సి వస్తుందని ప్రకటించాయి. ఈ అదనపు వసూళ్ల నిర్ణయం ఖాతాదారులకు ఆందోళన కలిగిస్తోంది. ఈ క్రమంలో ఖాతాదారులు తమ అకౌంట్లో ఉన్న నగదు నిల్వను ఫిబ్రవరి చివరి వారంలోనే బ్యాంకుకు వెళ్లి ఒకే దఫాలో ఉపసంహరించుకున్నారు. వారంలో రూ.50 వేల లోపు నగదు ఉపసంహరణకు ప్రభుత్వం అనుమతి ఇవ్వడంతో ఫిబ్రవరి 13 నుంచి 28 మధ్య భారీగా నగదు ఉపసంహరణ జరిగిందని రిజర్వ్‌ బ్యాంక్‌ సీనియర్‌ అధికారి ఒకరు వెల్లడించారు. దీంతో మార్చి మొదటివారంలో నగదుకు ఇబ్బంది ఏర్పడిందని, సరిగ్గా వేతనాల సమయంలో ఉద్యోగులు సమస్యల్లో పడ్డారని అంటున్నారు. వ్యాపారులు, వాణిజ్య సంస్థలు నగదు రహిత లావాదేవీలు సాగిస్తుండడం, అందుబాటులో ఉన్న కొద్దిపాటి నగదును తమ వద్దే నిల్వచేసుకోవడంతో బ్యాంకుల్లో రోజువారీ డిపాజిట్లపై తీవ్ర ప్రభావం పడిందని బ్యాంకర్లు చెబుతున్నారు. 
 
పరిమితి మించిన లావాదేవీలకు ఒక్కింటికి రూ.150లు లాగేయడానికి బ్యాంకులు పూనుకోవడంతో అంత కష్టం మీకెందుకు.. మా డబ్బు మేమే లాగేసుకుంటాం అనే ప్రతీకార దృష్టితో ప్రజలు ఏటీఎంలకు, బ్యాంకులకు వెల్లువెత్తడంతో దేశవ్యాప్తంగా ఏటీఎంలు డమాల్ అన్నాయి. బ్యాంకుల్లో డబ్బులు లేకుండా చేయడం ఎలా అనే కొత్త పాఠాన్ని ఇప్పుడు జనం బ్యాంకులకు నేర్పుతున్నట్లనిపిస్తోంది. రిజర్వ్ బ్యాంకు మూడు షిప్టులు కాదు ఆరు షిప్టుల వంతున పనిచేసినా నగదు కొరతను తప్పించడం ఇక బ్యాంకులకు సాధ్యం కాదనే అనిపిస్తోంది. ఈ దేశ ప్రజలు మళ్లీ బ్యాంకులను నమ్మాలంటే చాలా కాలమే పట్టేటట్టుంది.
 

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments