Webdunia - Bharat's app for daily news and videos

Install App

తమిళనాడులో పొలిటికల్ హీట్ : రజనీకాంత్‌కు సమన్లు!

Webdunia
శుక్రవారం, 18 డిశెంబరు 2020 (18:38 IST)
తమిళనాడు రాష్ట్ర శాసనసభకు వచ్చే యేడాది మే నెలలో ఎన్నికలు జరుగనున్నాయి. ఈ ఎన్నికల్లో విజయం సాధించడం కోసం ప్రధాన పార్టీలు ఇప్పటి నుంచే కసరత్తు చేస్తున్నాయి. ఈ క్రమంలో ఇపుడు తమిళనాడులో రాజకీయ వేడి మొదలైంది. డిసెంబ‌ర్ 31న పార్టీ పేరు, గుర్తును ప్రకటిస్తానని తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ ప్రకటించారు. అలాగే, జ‌న‌వ‌రిలో పార్టీని ప్రారంభిస్తాన‌ని చెప్పారు. అంతే.. రాష్ట్రంలో రాజకీయ వేడి ఒక్కసారిగా పెరిగిపోయింది. 
 
త‌మిళ‌నాడు రాజకీయ నేతలు త‌మ ఆట‌ను స్టార్ట్ చేశార‌ని అంటున్నారు. 2018లో తూత్తూకూడిలో జ‌రిగిన స్టైరిలైట్ ఫైరింగ్ ఘ‌ట‌న‌కు సంబంధించిన క‌మీష‌న్ ర‌జినీకాంత్‌కు స‌మ‌న్ల‌ను జారీ చేసిన‌ట్లు స‌మాచారం. స్టెరిలైట్‌కు వ్య‌తిరేక ఉద్య‌మం జ‌రిగిన‌ప్పుడు అది హింసాత్మ‌కంగా మారింది. అప్పుడు జ‌రిగిన పోలీస్ పైరింగ్‌లో 13 మంది ప్రాణాలు కోల్పోయారు. దీనిపై రిటైర్డ్ జ‌డ్జీ అరుణ్ జ‌గ‌దీశ‌న్ ఆధ్వ‌ర్యంలో క‌మీష‌న్ విచార‌ణ జ‌రుపుతోంది. 
 
అప్పట్లో ర‌జనీకాంత్ తూత్తుకూడిని ఘ‌ట‌న‌లో పోలీసుల చ‌ర్య‌ను ఖండించారు. అయితే తూత్తుకూడిని సంద‌ర్శించిన త‌ర్వాత త‌న వ్యాఖ్యల‌ను మార్చుకున్నారు. వ్యాఖ్య‌లు మార్చుకున్నందుకు ర‌జినీ విమర్శ‌ల‌ను ఎదుర్కొన్న‌ప్ప‌టికీ ఆయ‌న మార్చుకున్న త‌న వ్యాఖ్య‌ల‌పైనే నిల‌బడ్డారు. 
 
ఈ ఏడాది ఫిబ్ర‌వ‌రిలో ఈ కేసుకు సంబంధించిన స‌మ‌న్లు అందుకున్న‌ప్ప‌టికీ ర‌జినీకాంత్ వ్య‌క్తిగ‌త మిన‌హాయింపు కోరుకున్నారు. మ‌ధ్య‌లో కోవిడ్ కార‌ణంగా విచార‌ణ మంద‌గించింది. ఇప్పుడు మళ్లీ విచార‌ణ వేగం పుంజుకుంది. ఈ నేప‌థ్యంల ర‌జినీకాంత్‌కు మ‌రోసారి స‌మన్లు అందుకున్నారు. మ‌రి ఈసారి త‌లైవా ఏం చేస్తారో చూడాలి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సెల్ ఫోన్లు రెండూ ఇంట్లో వదిలేసి రాంగోపాల్ వర్మ పరార్? ఇంటి ముందు పోలీసులు

ఆ ఫ్యామిలీస్ కీ వేరే లెవెల్ ఆఫీస్ వెబ్ సిరీస్ కనెక్ట్ అవుతుంది : డైరెక్టర్ ఇ సత్తిబాబు

తన మాజీ భర్తకు ఇచ్చిన గిఫ్టులపై సమంత అలా కామెంట్స్ చేయడం భావ్యమేనా?

రోడ్డు ప్రమాదంలో చిక్కిన కాంతార టీమ్.. కొల్లూరులో బస్సు బోల్తా

ఏఆర్ రెహ్మాన్ ప్రపంచంలోనే అత్యుత్తమైన వ్యక్తి : సైరా బాను

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బార్లీ వాటర్ ఎందుకు తాగాలి? ప్రయోజనాలు ఏమిటి?

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

బాదంపప్పులను తింటుంటే వ్యాయామం తర్వాత త్వరగా కోలుకోవడం సాధ్యపడుతుందంటున్న పరిశోధనలు

సింక్రోనస్ ప్రైమరీ డ్యూయల్ క్యాన్సర్‌లకు అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విజయవంతమైన చికిత్స

ఎండుద్రాక్షలు ఎందుకు తినాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments