Webdunia - Bharat's app for daily news and videos

Install App

రెండు రోజుల్లో శశికళ కథ సమాప్తం : సీఎం పన్నీర్ వర్గం నేత పాండ్యన్

తమిళనాడులో శశికళ వ్యతిరేక వర్గం బలం పెరుగుతోంది. ఈ క్రమంలో, పన్నీర్ సెల్వం వర్గానికి చెందిన అన్నాడీఎంకే నేత పాండ్యన్ మరోసారి శశికళపై నిప్పులు చెరిగారు. మరో రెండు రోజుల్లో శశికళ కథ ముగిసిపోతుందని ఆయన జ

Webdunia
గురువారం, 9 ఫిబ్రవరి 2017 (18:00 IST)
తమిళనాడులో శశికళ వ్యతిరేక వర్గం బలం పెరుగుతోంది. ఈ క్రమంలో, పన్నీర్ సెల్వం వర్గానికి చెందిన అన్నాడీఎంకే నేత పాండ్యన్ మరోసారి శశికళపై నిప్పులు చెరిగారు. మరో రెండు రోజుల్లో శశికళ కథ ముగిసిపోతుందని ఆయన జోస్యం చెప్పారు. తాను ఎన్నటికీ రాజకీయాల్లోకి రానని, తనకు రాజకీయ పదవుల పట్ల ఆసక్తి లేదంటూ జయలలితకు 2012లో శశికళ లేఖ రాశారని చెప్పిన ఆయన... ఇప్పుడెందుకు ముఖ్యమంత్రి కావాలని కలలు కంటున్నారని ప్రశ్నించారు. తామంతా ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. తమిళ ప్రజలంతా శశికళకు బుద్ధి చెబుతారని అన్నారు. 
 
అంతకుముందు... గురువారం చెన్నైకు వచ్చిన తాత్కాలిక గవర్నర్ సీహెచ్.విద్యాసాగర్ రావును ఆపద్ధర్మ ముఖ్యమంత్రి ఓ.పన్నీర్ సెల్వం కలిశారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులతో పాటు.. తన రాజీనామాకు దారితీసిన వాస్తవ విషయాలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. శ‌శిక‌ళ చేసిన ఒత్తిడి వ‌ల్లే తాను రాజీనామా చేశాన‌ని విద్యాసాగ‌ర్ రావుతో చెప్పారు. త‌న రాజీనామాకు దారితీసిన అన్ని ప‌రిస్థితుల‌ను గురించి ఆయ‌న స‌మ‌గ్రంగా వివ‌రించారు. పార్టీలో తన బలాన్ని ఎలా ప్రదర్శిస్తారో చెప్పారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఏపీ సీఎం చంద్రబాబుకు బహుమతి ఇచ్చిన పూనమ్ కౌర్

Rajamouli: ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా యమదొంగ రీ రిలీజ్

జలియాన్‌వాలా బాగ్ హత్యాకాండ కేసరి ఛాప్టర్ 2 తెలుగు లో రాబోతోంది

Kamlhasan: సిద్ధాంత పోరాటంగా థగ్ లైఫ్ యాక్షన్-ప్యాక్డ్ ట్రైలర్ రిలీజ్

చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్ కోసం కూడా కథలు సిద్ధం చేశాం : డైరెక్టర్ విజయ్ కనకమేడల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

Black Salt: మజ్జిగలో ఈ ఒక్కటి కలుపుకుని తాగితే ఎన్ని ప్రయోజనాలో?

గ్రీన్ టీ తాగుతున్నారా? ఐతే ఇవి తెలుసుకోండి

తాటి బెల్లం ఆరోగ్య ప్రయోజనాలు

బరువు తగ్గడం కోసం 5 ఆరోగ్యకరమైన స్నాక్స్, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments