Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమెరికాలో కలవరపెడుతున్న భారతీయ విద్యార్థుల మృతులు... తాజాగా మరొకరు మృతి!!

ఠాగూర్
శుక్రవారం, 2 ఫిబ్రవరి 2024 (08:30 IST)
అమెరికాలో భారతీయ విద్యార్థుల మరణాలు కలవరపాటుకు గురిచేస్తున్నాయి. గత వారంలో రోజుల్లో ముగ్గురు విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. తాజాగా మరో విద్యార్థి చనిపోయాడు. వరుసగా సంభవిస్తున్న ఈ మృతులు అమెరికా అధికారులతో పాటు.. భారత రాయబార కార్యాలయ అధికారులను సైతం ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఈ తాజా మృతి కేసు వివరాలను పరిశీలిస్తే, శ్రేయాస్ రెడ్డి బెనిగెరి అని విద్యార్థి ఒహియోలోని సిన్సినాటిలో విగతజీవిగా కనిపించాడు. అమెరికాలో భారతీయ విద్యార్థి చనిపోవడం ఇది మూడోసరి. శ్రేయాస్ రెడ్డి మరణానికి కారణం తెలియాల్సివుంది.
 
కాగా, శ్రేయాస్ లిండర్ స్కూల్ ఆఫ్ బిజినెస్‌లో చదువుతున్నాడు. శ్రేయాస్ మృతిపై న్యూయార్క్‌లోని భారతీయ రాయబార కార్యాలయం ప్రగాఢ సానుభూతిని, అతని కుటుంబ సభ్యులకు తమ సంతాపాన్ని తెలిపింది. కాగా, ఈ వారంలో వివేక్ సైనీ, నీల్ ఆచార్య అనే ఇద్దరు భారతీయ విద్యార్థులు కూడా ప్రాణాలు కోల్పోయిన విషయం తెల్సిందే. తాజాగా మృతి చెందిన శ్రేయాస్ రెడ్డి మృతికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియల్సివుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నా ఎక్స్ ఖాతా హ్యాక్ రికవరీ అయింది... : శ్రేయా ఘోషల్ (Video)

హీరోయిన్ శ్రీలీలకు చేదుఅనుభవం - చేయిపట్టుకుని లాగిన అకతాయిలు (Video)

జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌కు మాతృవియోగం..

శ్రద్ధా కపూర్ అచ్చం దెయ్యంలానే నవ్వింది... అందుకే ఎంపిక చేశాం...

"ఏదైనా నేల మీద ఉన్నపుడే చేసేయ్యాలి... పుడతామా ఏంటి మళ్ళీ" అంటున్న చెర్రీ (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

తర్వాతి కథనం
Show comments