పబ్‌జీకి పోటీగా మరో ఇండియన్ గేమ్!

Webdunia
శుక్రవారం, 19 మార్చి 2021 (09:40 IST)
ఆన్‌లైన్ బ్యాటిల్ గేమ్ పబ్‌జీకి పోటీగా మరో ఇండియన్ గేమ్ రాబోతోంది. ఇప్పటికే ఫౌజీ అనే గేమ్ పబ్‌జీకి పోటీగా వచ్చింది. ఈ గేమ్‌ను ఇండియన్ ఆర్మీ నేపథ్యంలో స్టూడియో ఎన్‌కోర్ ప్రైవేట్ లిమిటెడ్ రూపొందించింది. అయితే ఈ గేమ్ అంతగా సక్సెస్ కాలేదు.

కాగా.. ఇప్పుడు మరో భారతీయ గేమ్ ఈ పోటీలోకొచ్చింది. ‘సికో’ పేరుతో రాబోతున్న ఈ గేమ్‌ను ఇండిక్‌ అరెనా అనే డెవలపర్‌ కంపెనీ రూపొందిస్తోంది. దీనికి సంబంధించిన అనౌన్స్‌మెంట్‌ ట్రైలర్‌ను సికో తాజాగా విడుదల చేసింది.

ఈ గేమ్‌ పబ్‌జీకి గట్టి పోటీ ఇస్తుందని, ఇందులో పబ్‌జీక పోటీగా అనేక కీలక ఫీచర్లున్నాయని సికో చెబుతోంది.  ట్రైలర్‌ ప్రకారం చూస్తే అడవులు, దేవాలయ ప్రాంగణాలు, ఆఫీస్‌లలో ఈ వార్ గేమ్‌ ఉండబోతోందని తెలుస్తోంది.

ఈ గేమ్‌కు సంబంధించిన డేటా గూగుల్ ప్లే స్టోర్‌లో ఉంది. దాని డిస్క్రిప్షన్‌లో ఉన్న సమాచారం ప్రకారం.. ఆన్‌లైన్‌లో ఫ్రెండ్స్‌తో ఈ గేమ్‌ ఆడుకోవచ్చని తెలుస్తోంది. ప్రస్తుతం ఈ గేమ్‌ ప్రీ రిజిస్ట్రేషన్‌ కూడా మొదలైంది.

అయితే ఈ గేమ్ ఎప్పుడు పూర్తిగా అందుబాటులోకి వస్తుందో ఇంకా తెలియరాలేదు. మరి ఈ గేమ్ పబ్‌జీకి సరైన ప్రత్యామ్నాయంగా నిలుస్తుందో లేదో చూడాలి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Shruti Haasan: అద్భుతమైన నాన్న అంటూ శ్రుతిహాసన్ ఎమోషనల్ పోస్ట్

Virat Karna: శివాలయం సెట్‌లో విరాట్ కర్ణపై నాగబంధం సాంగ్ షూటింగ్

Kamal hasan: కమల్ హాసన్ జన్మదినం సందర్భంగా అన్బరివ్ తో చిత్రం ప్రకటన

DiL Raju: హైదరాబాద్ లో అంతర్జాతీయ షార్ట్ ఫిలిం ఫెస్టివల్ - దిల్ రాజు

Jatadhara review: సుధీర్ బాబు, సోనాక్షి సిన్హా చిత్రం జటాధర రివ్యూ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ప్రపంచ మధుమేహ దినోత్సవం: రక్తంలో చక్కెర స్థాయిలను నిర్వహించడానికి కాలిఫోర్నియా బాదంపప్పులు

హ్యుందాయ్ హోప్ ఫర్ క్యాన్సర్ ద్వారా క్యాన్సర్ నుంచి సంరక్షణలో ముందడుగు

చిక్కుడు కాయలు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఎంత?

ఆస్తమా రోగులు డ్రాగన్ ఫ్రూట్ తింటే...

అధిక రక్తపోటుతో బాధపడేవారు ఈ పని చేయండి

తర్వాతి కథనం
Show comments