Webdunia - Bharat's app for daily news and videos

Install App

కాన్పు చేశారు.. కాటన్ మరిచారు.. సీఎంసీ వైద్యుల నిర్లక్ష్యం

Webdunia
గురువారం, 27 అక్టోబరు 2022 (11:37 IST)
కాన్పు కోసం వెళితే సిజేరియన్ ఆపరేషన్ చేసి బిడ్డను బయటకు తీసిన వైద్యులు కుట్లు వేసే క్రమంలో దూది (కాటన్)ని మహిళ కడుపులోనే మరిచి కుట్లు వేశారు. ఈ ఘటన తమిళనాడు రాష్ట్రంలోని రాయవేలూరులో ఉన్న క్రిస్టియన్ మెడికల్ కాలేజీలో జరిగింది. 
 
బాధితులు ఏపీలోని నెల్లూరు జిల్లా వాసులు. వైద్యులు చేసిన తప్పును ఆలస్యంగా గుర్తించిన బాధితులు నష్టపరిహారం కోరుతూ నెల్లూరు జిల్లా వినియోగదారుల వివాదాల పరిష్కారాల కమిషన్‌ను ఆశ్రయించింది. రోగికి 15 లక్షల రూపాయల నష్టపరిహారం చెల్లించాలని ఆదేశించింది. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, గత 2015లో నెల్లూరు జిల్లా ఏఎస్.పేటకు చెందిన ఫాతీం భార్య రశీలబాను కాన్పుకోసం వేలూరులోని సీఎంసీ ఆస్పత్రిలో చేరింది. నవంబరు 27వ తేదీన సిజేరియన్ ద్వారా ఆడబిడ్డకు జన్మనిచ్చింది. డిసెంబరు 3వ తేదీన ఆమెను ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేశారు. 
 
ఇంటికి వెళ్లిన తర్వాత ఆమెకు కడుపు నొప్పి మొదలైంది. ఈ నొప్పి తీవ్రతరం కావడంతో సుమారు రెండేళ్లపాటు హైదరాబాద్, విజయవాడ, వేలూరుల్లోని పలు ఆస్పత్రుల్లో చికిత్స పొందారు.

అయినప్పటికీ నొప్పికి ఉపశమనం లభించలేదు. ఈ క్రమంలో 2017 జూన్ 17వ తేదీన నెల్లూరులోని కిమ్స్ ఆస్పత్రిలో చేరగా, వారు స్కాన్, ఇతర వైద్య పరీక్షలు చేసి కడుపులో కాటన్ ఉన్నట్టు గుర్తించారు. 

సంబంధిత వార్తలు

సినారేకు నివాళిగా రాబోతున్న "నా ఉచ్ఛ్వాసం కవనం" ప్రోగ్రాం కర్టెన్ రైజర్ కార్యక్రమం

కౌంట్‌డౌన్ ప్రారంభం: మాగ్నమ్ ఓపస్ 'కల్కి 2898 AD' అప్‌డేట్

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

తర్వాతి కథనం
Show comments