ఒకే రేఖపై నాలుగు గ్రహాలు.. 23న చంద్రుడు కూడా.. అది సువర్ణావకాశం..?

Webdunia
గురువారం, 21 ఏప్రియల్ 2022 (14:14 IST)
అంతరిక్షంలో అద్భుతం జరిగింది. ఒకే రేఖపై నాలుగు గ్రహాలు కనిపించాయి. దీనిని ప్లానెట్స్‌ పరేడ్‌ అని అంటారు. కాకినాడ జిల్లా ఏలేశ్వరంలో స్పార్క్‌ ఫౌండేషన్‌ చిత్రీకరించింది. బుధవారం తెల్లవారు జామున 3.49 గంటల నుంచి 5.06 గంటల మధ్య నాలుగు గ్రహాలు ఒకే రేఖపైకి వచ్చి కనువిందు చేసింది.
 
అంతకుముందు శని, అంగారక, శుక్ర గ్రహాలు ఒకే రేఖపైకి రావడం మార్చి చివరిలో ప్రారంభమైంది. ఏప్రిల్‌లో బృహస్పతి అదే రేఖపైకి వచ్చి చేరింది. నాలుగు గ్రహాలు ఒకే రేఖపై దర్శనమివ్వడం అత్యంత అరుదైన విషయమని ఆస్ట్రనామికల్‌ వింగ్‌ డైరెక్టర్‌ ఎస్‌.సాయి సందీప్‌ వెల్లడించారు. 
 
ఈ నెల 23న నాలుగు గ్రహాల చెంతకు చంద్రుడు వచ్చి చేరడంతో అంతకు మించిన అద్భుతం ఆవిష్కృతం కానుందన్నారు. ప్రస్తుతం సరళరేఖ కుడిపక్కన చంద్రుడు కనిపిస్తున్నాడు. ఐదు గ్రహాలను ఒకే వరుసగా చూడటం ప్రజలకు సువర్ణ అవకాశమని సాయిసందీప్‌ చెప్పుకొచ్చారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rajinikanth Birthday Special: సూపర్ స్టార్ 75వ పుట్టిన రోజు.. 50ఏళ్ల సినీ కెరీర్ ప్రస్థానం (video)

Akhanda 2 Review,అఖండ 2 తాండవం.. హిట్టా. ఫట్టా? అఖండ 2 రివ్యూ

దక్షిణాదిలో జియో హాట్‌స్టార్ రూ.4 వేల కోట్ల భారీ పెట్టుబడి

Peddi: పెద్ది కొత్త షెడ్యూల్ హైదరాబాద్‌లో ప్రారంభం, మార్చి 27న రిలీజ్

Rana: టైం టెంపరరీ సినిమా అనేది ఫరెవర్ : రానా దగ్గుబాటి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాత్రిపూట ఇవి తింటున్నారా? ఐతే తెలుసుకోవాల్సిందే

సీజనల్ ఫ్రూట్ రేగు పండ్లు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఫ్యాషన్‌ను ప్రముఖమైనదిగా నడిపించే బ్లెండర్స్ ప్రైడ్ ఫ్యాషన్ టూర్

అధునాతన క్యాన్సర్ చికిత్సకై టాటా మెమోరియల్ ఎసిటిఆర్ఇసితో కోటక్ మహీంద్రా భాగస్వామ్యం

winter health, తులసి పొడిని తేనెలో కలిపి తాగితే...

తర్వాతి కథనం
Show comments