Webdunia - Bharat's app for daily news and videos

Install App

చెన్నైలో చౌక ధరకే సినిమా టిక్కెట్లు: 'అమ్మ థియేటర్లు' రానున్నాయోచ్!

తమిళనాడు సీఎం జయలలితను పురట్చితలైవి, అమ్మ అని పిలుస్తుంటారు. అమ్మ పేరుతో ఇప్పటికే తమిళనాట క్యాంటీన్లు, మందు షాపులు వంటివి ప్రారంభమైన నేపథ్యంలో.. ''అమ్మ థియేటర్ల'' నిర్మాణానికి ప్రస్తుతం రంగం సిద్ధం అవ

Webdunia
సోమవారం, 18 జులై 2016 (15:32 IST)
తమిళనాడు సీఎం జయలలితను పురట్చితలైవి, అమ్మ అని పిలుస్తుంటారు. అమ్మ పేరుతో ఇప్పటికే తమిళనాట క్యాంటీన్లు, మందు షాపులు వంటివి ప్రారంభమైన నేపథ్యంలో.. ''అమ్మ థియేటర్ల'' నిర్మాణానికి ప్రస్తుతం రంగం సిద్ధం అవుతోంది. చెన్నైలోని పాడి బ్రిడ్జి సమీపంలో 3.94 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ప్రభుత్వ స్థలంలో అమ్మ థియేటర్‌ను ఏర్పాటు చేయనున్నట్లు మేయర్ దురైస్వామి ప్రకటించారు.  
 
చెన్నై ప్రజల కోసం చౌక ధరలో వినోదం పంచే దిశగా థియేటర్లను ఏర్పాటు చేయనున్నట్లు దురైస్వామి తెలిపారు. అమ్మ థియేటర్ల కోసం స్థలాల ఎంపిక జరుగుతోందని చెప్పారు. ఇంకా షాపింగ్ మాల్స్‌లోనూ అమ్మ థియేటర్లను ఏర్పాటుకు రంగం సిద్ధమవుతోందని చెప్పారు.

అలాగే చెన్నై టీనగర్‌లో రూ.17.28 కోట్లతో అమ్మ థియేటర్ నిర్మితం కానుందన్నారు. చెన్నై నగరంలో ఏర్పాటు కానున్న అమ్మ థియేటర్లలో రూ.10, రూ.20, రూ.30లకు టిక్కెట్ ధరలుంటాయని తెలిసింది.

ఎం.ఎల్.ఎ.లను కిడ్నాప్ చేసిన రామ్ చరణ్ - తాజా అప్ డేట్

దేవర లో 19 న ఎర్రసముద్రం ఎగిసెగిసిపడుద్ది : రామ జోగయ్యశాస్త్రి

సుచి లీక్స్ గోల.. ధనుష్, త్రిషనే కాదు.. మాజీ భర్తను కూడా వదిలిపెట్టలేదు..

పుష్ప2 నుంచి దాక్షాయణి గా అనసూయ తిరిగి రానుంది

థియేటర్ల మూత అనంతరం డైరెక్టర్స్ అసోసియేషన్ ఈవెంట్

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

మెదడు ఆరోగ్యంపై ప్రభావం చూపే శారీరక శ్రమ

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

పిల్లల మానసిక ఆరోగ్యానికి దెబ్బతీసే జంక్ ఫుడ్.. ఎలా?

తర్వాతి కథనం
Show comments