అమిటీ యూనివర్సిటీలో లా స్టూడెంట్‌కు 60 చెంపదెబ్బలు- వీడియో వైరల్

సెల్వి
శనివారం, 6 సెప్టెంబరు 2025 (23:15 IST)
Law Student
ఉత్తరప్రదేశ్‌లోని ప్రముఖ అమిటీ యూనివర్సిటీలో లా స్టూడెంట్‌పై దారుణం చోటుచేసుకుంది. తోటి విద్యార్థిపై సహచర విద్యార్థులు దాడికి పాల్పడ్డారు. దాదాపు 60 చెంపదెబ్బలు కొట్టారు. దాదాపు 45 నిమిషాల పాటు తోటి విద్యార్థిపై సహచర విద్యార్థులు పాల్పడిన ఈ దారుణానికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అయ్యింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 
 
వివరాల్లోకి వెళితే, లక్నో అమిటీ క్యాంపస్‌లో బీఏ ఎల్‌ఎల్‌బీ రెండో సంవత్సరం చదువుతున్న షికార్ ముఖేశ్ కేసర్వానీపై ఆగస్టు 26న యూనివర్సిటీ పార్కింగ్ స్థలంలో ఈ దాడి జరిగింది. 
 
ఇటీవలే కాలికి లిగమెంట్ సర్జరీ చేయించుకున్న షికార్, ఊతకర్రల సాయంతో నడుస్తుండగా అతనిపై దాడికి పాల్పడ్డారు.  ఇద్దరు అమ్మాయిల గురించి షికార్ అనుచిత వ్యాఖ్యలు చేశాడనే కారణంతోనే ఈ దాడి జరిగినట్లు తెలుస్తోంది. బాధితుడి తండ్రి ముఖేశ్ కేసర్వానీ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. దాడికి పాల్పడిన ముగ్గురు విద్యార్థులపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Bandla Ganesh: బండ్ల గణేష్ పై ఇండస్ట్రీ సీరియస్ - గబ్బర్ సింగ్ లాంటి సినిమా తీయలేనా?

Manoj: ఎవరినీ మోసం చేయను, మౌనిక ను బాగా చూసుకుంటా : మంచు మనోజ్

ప్రైమ్ వీడియోలో మా దృష్టి గొప్ప కథలను నిర్మించడం మీదే ఉంది - పద్మా కస్తూరిరంగన్

ప్రణవ్ మోహన్ లాల్.. డీయస్ ఈరే... శ్రీ స్రవంతి మూవీస్ ద్వారా విడుదల

పురుషః పాత్రల ఫస్ట్ లుక్ ఆవిష్కరించిన డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు డ్రాగన్ ఫ్రూట్ తింటే...

అధిక రక్తపోటుతో బాధపడేవారు ఈ పని చేయండి

బరువు పెరగాలనుకునేవారు ఈ 5 పదార్థాలు తింటే చాలు...

ఔషధంలా ఉపయోగపడే లవంగాలు, ఏమేమి ప్రయోజనాలు?

అదేపనిగా సెల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌ల ముందు కూర్చుంటున్నారా?

తర్వాతి కథనం
Show comments