మా నాన్నకు పడక సుఖం ఇవ్వకుంటే ఇక్కడే చంపేస్తా : భార్యకు అమెరికా టెక్కీ భర్త వార్నింగ్
అగ్నిసాక్షిగా పెళ్లాడిన భార్యను కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన బాధ్యత భర్తపై ఉంటుంది. అలాంటి భర్తే.. కన్నతండ్రికి పడక సుఖం ఇవ్వాలంటూ తన భార్యను ఆదేశించాడు. అంతేనా... నాకు నాన్న.. నీకు మామ.. సర్దుకుపోత
అగ్నిసాక్షిగా పెళ్లాడిన భార్యను కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన బాధ్యత భర్తపై ఉంటుంది. అలాంటి భర్తే.. కన్నతండ్రికి పడక సుఖం ఇవ్వాలంటూ తన భార్యను ఆదేశించాడు. అంతేనా... నాకు నాన్న.. నీకు మామ.. సర్దుకుపోతే తప్పులేదంటూ ఉచిత సలహా కూడా ఇచ్చాడు. తన మాట వినకుంటే హత్య చేస్తానని బెదిరించాడు. ఇంతకీ ఇలా సలహా ఇచ్చి, బెదిరించింది ఎవరో తెలుసా అమెరికా టెక్కీ. ఈ దారుణం ఐటీ నగరం బెంగుళూరులో తాజాగా వెలుగులోకి వచ్చింది. ఈ వివరాలను పరిశీలిస్తే...
బెంగుళూరులోని ఇందిరా నగర్‌కు చెందిన రఘునందన్ అనే వ్యక్తి అమెరికాలో సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా పని చేస్తున్నాడు. ఈయనకు అదే ప్రాంతానికి చెందిన ఓ యువతితో గత 2016 ఏప్రిల్ నెలలో వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. వివాహమైన తర్వాత రఘునందన్ ఉద్యోగ రీత్యా అమెరికాకు వెళ్లిపోయాడు.
దీంతో అతని భార్య.. అత్త ఉష, మామ వెంకటపతితో కలిసి బెంగుళూరులోని నివసిస్తోంది. ఈ క్రమంలో కోడలిపై మామ కన్నేశాడు. ఇదే అదునుగా భావించిన ఆయన.. ఎక్కడపడితే అక్కడ చేతులు వేస్తూ లైంగికంగా వేధిస్తూ వచ్చాడు. ఈ విషయం అత్త, భర్తల దృష్టికి తీసుకెళ్లగా.. మీ మామ చెప్పినట్లు నడుచుకోవాలని సూచించగా, మా నాన్నతో సర్దుకుపోవాలంటూ సలహా ఇచ్చారు.
ఇక బెంగుళూరులో అత్తమామల వేధింపులు భరించలేక ఆమె.. భర్త వద్దకు వెళ్లింది. ఆమె వెళ్లిన మరుసటి రోజే అత్తమామలు కూడా అమెరికాకు వెళ్లి తమ వేధింపులు కొనసాగించారు. జరిగిన విషయం భర్తకు చెపితే... "మా నాన్న చెప్పినట్లు వినకుంటే నిన్ను ఇక్కడే చంపేస్తా" అంటూ అమెరికా టెక్కీ భర్త బెదిరించాడు. దీంతో ఆ మహిళ చివరకు పుట్టింటికి చేరుకుని పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆ మహిళ ఫిర్యాదుతో వెంకటపతి లైంగిక దాడికి పాల్పడ్డాడని ఆ మహిళ తన ఫిర్యాదు చెయ్యడంతో ముగ్గురిపై పోలీసులు కేసు నమోదు చేశారు.