Webdunia - Bharat's app for daily news and videos

Install App

తలపండిన వృద్ధుడు 14 ఏళ్ల బాలికను గర్భవతి చేశాడు.. ఆపై అబార్షన్..?

తలపండిన వృద్ధుడు 14ఏళ్ల మైనర్ బాలికను గర్భవతిని చేసిన దుర్ఘటన తమిళనాడులోని ఆంబూర్‌ జిల్లాలో చోటుచేసుకుంది. వావివరుసలు లేకుండా.. వయోబేధం లేకుండా కామాంధులు చిన్నారులపై, బాలికలపై, మహిళలపై, చివరి వృద్ధురా

Webdunia
బుధవారం, 31 మే 2017 (13:12 IST)
తలపండిన వృద్ధుడు 14ఏళ్ల మైనర్ బాలికను గర్భవతిని చేసిన దుర్ఘటన తమిళనాడులోని ఆంబూర్‌ జిల్లాలో చోటుచేసుకుంది. వావివరుసలు లేకుండా.. వయోబేధం లేకుండా కామాంధులు చిన్నారులపై, బాలికలపై, మహిళలపై, చివరి వృద్ధురాళ్లపై కూడా విరుచుకుపడుతున్నారు. ఈ క్రమంలో 65 ఏళ్ల ఓ వృద్ధుడు 14 ఏళ్ల చిన్నారిపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఫలితం ఆ బాలిక గర్భం దాల్చింది.
 
వివరాల్లోకి వెళితే.. ఆంబూరుకు చెందిన 65 ఏళ్ల సలీమ్ అనే వ్యక్తి అరటి పండ్ల వ్యాపారం చేస్తున్నాడు. ఇతడికి షకీరా అనే భార్య ద్వారా తొమ్మిది మంది సంతానం ఉన్నారు. ఆంబూరులోని ఓ బంధువుల ఇంటికి అప్పుడప్పుడు సలీమ్ వెళ్ళి వచ్చేవాడు. అక్కడున్న 14 ఏళ్ల చిన్నారిపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. దీంతో 14ఏళ్ల బాలిక గర్భం ధరించింది. 
 
ఈ విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు బాలికకు అబార్షన్ చేయించారు. ఆపై బాలిక తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు చట్ట విరుద్ధంగా అబార్షన్ చేసిన వైద్యుడి అరెస్ట్ చేయడంతో పాటు.. అత్యాచారానికి ఒడిగట్టిన వృద్ధుడి కోసం గాలిస్తున్నారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Aamani : డొక్కా సీతమ్మ తో ఆమని కి అవార్డు రావాలి: మురళీ మోహన్

సరికొత్త స్క్రీన్ ప్లేతో వస్తున్న 28°C మూవీ మెస్మరైజ్ చేస్తుంది : డైరెక్టర్ డా. అనిల్ విశ్వనాథ్

ప్రత్యేకమైన రోజుగా మార్చిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు : ఉపాసన

భర్తను పరిచయం చేసిన నటి అభినయ!!

కసికా కపూర్... చాలా కసి కసిగా వుంది: బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

తర్వాతి కథనం