Webdunia - Bharat's app for daily news and videos

Install App

పొత్తుకు సిద్ధమే.. నేతాజీదే నిర్ణయం... యూపీ సీఎం అఖిలేశ్‌ యాదవ్‌

వచ్చే యేడాది జరుగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తు పెట్టుకునేందుకు తాము సిద్ధమేనని అయితే, తుది నిర్ణయం మాత్రం తమ పార్టీ అధినేత ములాయం సింగ్‌దేనని ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ అన్నారు.

Webdunia
శుక్రవారం, 4 నవంబరు 2016 (09:41 IST)
వచ్చే యేడాది జరుగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తు పెట్టుకునేందుకు తాము సిద్ధమేనని అయితే, తుది నిర్ణయం మాత్రం తమ పార్టీ అధినేత ములాయం సింగ్‌దేనని ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ అన్నారు.
 
రాష్ట్ర ముఖ్యమంత్రి అఖిలేశ్‌ యాదవ్‌ వికాస్‌ రథయాత్ర ప్రారంభం సందర్భంగా మాట్లాడుతూ సమాజ్‌వాదీ పార్టీ(ఎస్పీ) ఏ సెక్యులర్‌ పార్టీతో అయినా పొత్తుకు సిద్ధమేనని, అయితే తుది నిర్ణయం తీసుకునేది మాత్రం ఎస్పీ చీఫ్‌ ములాయం సింగ్‌ యాదవ్‌(నేతాజీ) అని స్పష్టంచేశారు. అలాగే ఇతర పార్టీలతో పొత్తులు కుదర్చునేందుకు ఏ విధంగా ముందుకెళ్తున్నారో, ఏ ప్రయత్నాలు జరుగుతున్నాయో తనకు తెలియదన్నారు. 
 
సమాజ్‌వాదీ పార్టీ నేత, నవంబరు 5న జరగనున్న సమాజ్‌వాదీ పార్టీ 25 వసంతాల వేడుకకు మాజీ పీఎం హెచ్‌డీ దేవె గౌడ, ఆర్జేడీ చీఫ్‌ లాలూ ప్రసాద్‌ యాదవ్‌, ఆర్‌ఎల్‌డీ చీఫ్‌ అజిత్‌ సింగ్‌ తదితరులు హాజరుకానున్నట్లు సమాచారం. ఈ వేడుకల్లో పొత్తుల గురించి చర్చించే అవకాశం ఉంది. ఇటీవల సమాజ్‌వాదీ పార్టీలో అంతర్గత విభేదాలు తలెత్తిన సంగతి తెలిసిందే. ఎస్పీ ఉత్తరప్రదేశ్‌ యూనిట్‌ చీఫ్‌గా శివపాల్‌ యాదవ్‌ను నియమించడం వివాదాలకు దారితీసింది. 

పవన్ కల్యాణ్‌పై షాకింగ్ కామెంట్స్ చేసిన రేణు దేశాయ్

మ్యూజిక్ షాప్ మూర్తి నుంచి రాహుల్ సిప్లిగంజ్ పాడిన అంగ్రేజీ బీట్ లిరికల్ వచ్చేసింది

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆహ్వానించిన దర్శకుల సంఘం

రోడ్డు ప్రమాదంలో పవిత్ర మృతి.. త్రినయని నటుడు చంద్రకాంత్ ఆత్మహత్య

రాహుల్ విజయ్, శివాని ల విద్య వాసుల అహం ఎలా ఉందంటే.. రివ్యూ

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments